పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ హైదరాబాద్ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారనే అంశంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, నాయకుల వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురినీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
