పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: పెద్దమందడి అపర రామానుజులు, పద్మభూషణులు, పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్రం (సప్తతి) సందర్భంగా శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామివారి సూచన మేరకు బుధవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వీటి రిజిస్ట్రేషన్ నంబర్ 3 ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండలం, వెల్టూరు గ్రామానికి చెందిన సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీమాన్ జి. వెంకట రామారెడ్డి, ప్రజ్ఞా వికాస్ కొత్త రాములు, రేవతమ్మ, జయమ్మ, అశ్విని, రాధ, బలరాము, యువ వికాస్ ప్రతినిధి వి. కురుమూర్తి (చీఫ్ కో-ఆర్డినేటర్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్టూరు గ్రామ సర్పంచ్ అశోక్, కార్యదర్శి వెంకటస్వామి, ఎస్. రమేష్, జగదీష్ రెడ్డి, సురేష్, మహేష్, రాము, కె. శివాజీ, శివ, రాజశేఖర్, కాశన్న, వెంకటయ్య, నాగన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. చిన్న జీయర్ స్వామివారి సప్తతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికతతో కొనసాగింది.
