ePaper
Thursday, August 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జాతీయ వడ్డెర సంఘం( జే వి ఎస్ ) మరియు బీసీ కులాలు తరపున

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కూటమి

ప్రభుత్వానికికృతజ్ఞతలుతెలియజేశారు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఖమ్మం జిల్లా జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు బత్తుల వీరబాబు అధ్యక్షతన జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ ఆదేశానుసారం ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జాతీయ గౌరవ సలహాదారులు డేరంగుల బ్రహ్మం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డేరంగుల బ్రాహ్మం మాట్లాడుతూ, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి ఏమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సమావేశం అనంతరం ఖమ్మంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన మహానీయుల ఆశయ సాధనకు, వడ్డెర మరియు బిసి కులాల హక్కుల పరిరక్షణకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు: ముఖ్య అతిథి: డేరంగుల బ్రహ్మం (జాతీయ గౌరవ సలహాదారులు) సభాధ్యక్షత: బత్తుల వీరబాబు (ఖమ్మం జిల్లా అధ్యక్షులు) జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు: నర్ర ఎల్లయ్య వల్లెపు సోమరాజు, బత్తుల గోపాలరావు గోగుల ఆది, ఆలకుంట కొండలు బత్తుల వెంకన్న, బత్తుల తిరుమలరావు, ఆలకుంట అంజయ్య  జాతీయ వడ్డెర సంఘం జిల్లా నాయకులు వేముల వేంకట ప్రసాద్, చింతల వెంకన్న, వేముల ఉపేందర్, వేముల వెంకట్రావు, పెనుగొండ వెంకట్రావు, రాయల వెంకటేశ్వర్లు, రాయల సీతయ్య, తమ్మిశెట్టి వీర్రాజు, బత్తుల నాగేశ్వరరావు, బత్తుల గోపాల్, కొండలరావు, చల్లా పుల్లయ్య, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, అంజయ్య, విడగొట్టి హనుమంతు, కుంచపు కుమార్, కుంచపు వెంకటేశ్వర్లు  వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు: నర్ర ఎల్లయ్య, ఖమ్మం జిల్లా టిడిపి పార్టీ నాయకులు కేతినేని హరీష్ ఓర్సు కృష్ణ, బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు: చిన్నారి హాస్పటల్ డాక్టర్ కేవీ కృష్ణారావు. కత్తి నెహ్రూ గౌడ్ , పెల్లూరు విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు, బీసీ సంఘాల ప్రతినిధులు మరియు వడ్డెర సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ వడ్డెర సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు కుంచపు కుమార్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు..

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!