ePaper
Thursday, August 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కొండా సుష్మిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందా ?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

కొండా సురేఖ పుట్టిన రోజున సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేంటి ?

 

ఈ నెల 13న ‘పాలించే ప్రభువు కాదు. కలిసి పనిచేసే గుంపుమేస్త్రీ’ అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ వ్యాసం రాసిన మంత్రి కొండా సురేఖ

 

తర్వాత మూడు రోజులకే రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు డుమ్మా కొట్టిన కొండా సురేఖ

 

సరిగ్గా వారం తిరగక ముందే నేరుగా కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నేరుగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు

 

నా వ్యాఖ్యలకు స్పందిస్తే రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరికలు

 

రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరకాల నుండి పోటీ చేస్తాడని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్న కాంగ్రెస్ తరపున తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానన్న హామీ ఏమయింది అని ప్రశ్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బీసీ మంత్రుల ఫోటోలు ఎందుకు లేవని ప్రశ్న పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్న రూ.200 కోట్ల భూమి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఎలా కట్టబెడతారని నిలదీత రేవంత్ రెడ్డి వెంట ఉన్న ‘పొంగు’ ఎంతో కాలం నిలవదు అని పరోక్షంగా పొంగులేటి ప్రస్తావన మేడారం జాతర నుండి సీతక్క, పొంగులేటితో కొండా సురేఖకు మొదలైన అంతర్గత యుద్ధం గతంలో సుష్మిత ఆరోపణలపై కిక్కురుమనని రేవంత్ వర్గం తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం  మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ కొండా సురేఖ వెనక అసలు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఉన్నారని ఊహాగానాలు షబ్బీర్ అలీని ఎందుకు పక్కన పెట్టారు ? మా నాన్న కొండా మురళికి ఇచ్చిన వాగ్దానం ఎందుకు మరిచారు ? సీతా దయాకర్ రెడ్డికి ఎందుకు పదవి ఇచ్చారు అని నిలదీసిన సుష్మిత ఇది కూడా టీ కప్పులో తుఫానులా మిగులుతుందా ? లేక అసలు కాంగ్రెస్, కొసరు కాంగ్రెస్ మధ్య రాజుకున్న నిప్పు రగిలిస్తుందా ? అని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ముందు కలకలం రేపుతున్న ఘటన ఇది వ్యూహాత్మకమా ? ఉద్దేశపూర్వకమా ?

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!