ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమల్లికార్జున్ ఖర్గే కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

మల్లికార్జున్ ఖర్గే కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేసిన మల్లికార్జున్ ఖర్గే

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 21 2026: నపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఆయనను కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఫార్మ్లను డబ్బులకు అమ్ముకున్నదంటూ, ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన ఆయన పూర్తిస్థాయిలో విచారించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!