పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 21 2026: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యాపర్లలో ఆఫీస్ సబార్డినేట్ గా 26 సంవత్సరాలు సేవలందించి నేడు పదవీ విరమణ పొందిన నరసింహులు రిటైర్మెంట్ ఫంక్షన్ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ… నరసింహులు ఎలాంటి రిమార్కులు లేకుండా నిజాయితీగా 26 సంవత్సరాలు సేవ చేసి రిటైర్ కావడం అభినందనీయమన్నారుఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తప్పనిసరి అని, కానీ రిటైర్మెంట్ రోజే రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నరసింహులు రెండవ జీవితం ఇప్పుడు మొదలవుతుందని, కుటుంబంతో, మనవళ్లతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భగవంతుడు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఇన్ని రోజులు చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ అంటే విశ్రాంతి కాదు, అది కొత్త ప్రయాణానికి నాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు మోయినోద్దీన్, ఆనంద్ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, అనిల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

