ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తి జిల్లాను బాల్య వివాహాల నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం జిల్లా ఎస్పి. సునీత రెడ్డి

వనపర్తి జిల్లాను బాల్య వివాహాల నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం జిల్లా ఎస్పి. సునీత రెడ్డి

📰 Generate e-Paper Clip

– బాల్య వివాహాల నుంచి విముక్తి పొందిన 54 మంది బాలికలకు ఎస్పీ అండ, మీకు అమ్మగా అక్కగా తోడుంటా మీ కాళ్లపై మీరు నిలబడేలా చేస్తా, 

– బాల్య వివాహాలకు దారితీసిన కుటుంబ పరిస్థితులపై ప్రత్యేక ఆరా కోరుకున్న నైపుణ్య వృత్తి కోర్సుల్లో మూడు నెలల శిక్షణ.. జీవనోపాధికి చేయూతనిస్తా జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 22.2026.బాల్య వివాహం ఆపడం అంటే కేవలం ఒక పెళ్లిని నిలిపివేయడం కాదు.. ఒక బాలిక బాల్యాన్ని, చదువును,ఆరోగ్యాన్ని, కలలను, భవిష్యత్తును కాపాడటమని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ బాల్య వివాహాల నుంచి విముక్తి కలిగించిన బాలికలు, వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ ప్రత్యేక చొరవతో వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలనుంచి విముక్తి కలిగించిన 54 మంది బాలికలలు వారి తల్లిదండ్రుల వనపర్తి డిఎస్పీ. గిరిబాబు, డిసిఆర్బి డీఎస్పీ.బాలాజీ నాయక్, ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇద్దరు ఎస్సైలతో బాల్యవివాహలకు దారితీసిన పరిస్థితిగతుల గురించి బాలికలఇళ్లదగ్గరికివెళ్లివారియొక్కకుటుంబపరిస్థితులు స్థితిగతుల గురించి సమాచారం సేకరించి జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన కల్పించి వారికి అమ్మగా అక్కగా తోడుంటానని భరోసా కల్పిస్తూ వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడే విధంగా వారికి ప్రత్యేకంగా మూడు నెలలు వారికీ కోరిన నైపుణ్య వృత్తి కోర్సుల్లో శిక్షణఇప్పించిజీవనోపాధికల్పించేందుకుఎస్పీ.ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఉంటామని హామీ ఇచ్చారు బాల్య వివాహాల బాల్యంలో వివాహాలు చేసుకోవడం వల్ల కలుగు అనర్థాల గురించిడాక్టర్లచేవారికివివరంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ.సునీత రెడ్డి మాట్లాడుతూ  బాల్య వివాహం ఆగిపోయినచోట కథ ముగియదు అక్కడి నుంచే ఒక బాలికకు కొత్త జీవితం ప్రారంభం కావాలని,మీ జీవితంలో ఎదురైన పరిస్థితులు మీ భవిష్యత్తును నిర్ణయించకూడదు. మీరు చదువుకోవాలి.. మీకు నచ్చిన నైపుణ్యాన్ని నేర్చుకోవాలి.. మీ కాళ్లపై మీరు నిలబడాలి. అందుకు వనపర్తి జిల్లా పోలీసు శాఖ మీకు అండగాఉంటుంది. మీకు ఏసమస్యవచ్చినాపోలీసులనుభయపడకుండా సంప్రదించండి. మిమ్మల్ని ఒక అధికారిగా మాత్రమే కాకుండా.. ఒక అమ్మగా, ఒక అక్కగా తోడుగా నిలబడిముందుకునడిపించేబాధ్యతనుతీసుకుంటాను. మీ భవిష్యత్తు సురక్షితంగా, గౌరవంగా ఉండేలా అవసరమైన ప్రతి సహకారం అందిస్తామని బాల్య వివాహం అనేది ఒక కుటుంబ సమస్యగా చూసే విషయం కాదు.. ఇది బాలిక హక్కులను, ఆరోగ్యాన్ని, విద్యను, భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక సమస్య. అందుకే తల్లిదండ్రులు కూడా బాలికలపై పెళ్లి ఒత్తిడి తీసుకురాకుండా, వారి కలలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవాలని వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలకు పూర్తిగాఅడ్డుకట్ట వేసి బాల్య వివాహాల నిర్మూలనకు ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఒక్క బాలిక భవిష్యత్తు కూడా బాల్య వివాహం కారణంగాచీకటిలోకివెళ్లకుండాప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.బాల్య వివాహాల నుంచి విముక్తిపొందినకొందరుబాలికలుతమఅనుభవాలను పంచుకున్నారు. తమ పెళ్లి ఆపిన సమయంలో కుటుంబ సభ్యులు బాధపడ్డారని, ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయామని,కానీ ఇప్పుడు బాల్య వివాహం జరిగి ఉంటే తమ జీవితాలు ఎలా ఉండేవో తెలుసుకున్నామనిభావోద్వేగంతోతెలిపారు.
వారిమాటల్లోనిఆవేదన,నేటిపరిస్థితిపైఉన్నఅవగాహన, భవిష్యత్తుపై కనిపించిన ఆశ సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. పలువురు బాలికలు భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమైనసమయంలో మీరు ఒంటరిగా లేరు పోలీసు శాఖ మీకు అండగా ఉంది అంటూ ఎస్పీ వారిని ఓదార్చి ధైర్యం కల్పించి శాలువాతో సన్మానించారు.బాల్య వివాహంఒకబాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఆమె శారీరక, మానసిక ఎదుగుదల, విద్యాభ్యాసం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది చిన్న వయసులో వివాహం, ముఖ్యంగా గర్భధారణ వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యానికి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని బాలికలు శారీరకంగా,మానసికంగా పూర్తిగాఎదగకముందేవివాహంచేయడంవల్లఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, మానసికఒత్తిడి,పోషకాహార లోపం తదితర అంశాలను వైద్యులు సవివరంగా వివరించారు. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన వయస్సు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేయడం ప్రతి తల్లిదండ్రి బాధ్యతని. బాలికలకు విద్యతో పాటు మంచి పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, మానసిక ధైర్యం కల్పించాలని, ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులనుసంప్రదించాలని సూచించారు.అనంతరం చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ పోస్టర్లను ఎస్పీ. సునీత రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డి ఎస్పీ. గిరిబాబు, డిసిఆర్బి డిఎస్పీ. బాలాజీ నాయక్,జిల్లా సంక్షేమ అధికారి. సుధరణి, ఎస్సైలు. విజయ్ కుమార్, జగన్మోహన్ అంజద్, హైమా,భరోసా, షీ టీం, ఏ హెచ్ టి యు, సిబ్బంది, డాక్టర్లు, బాల్యవివాహాల విముక్తి బాలికలు వారి తల్లిదండ్రులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!