ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జీవో 97 ను రద్దు చేయాలని మందలపల్లిలో బిఆర్ఎస్ నిరసన

జీవో 97 ను రద్దు చేయాలని మందలపల్లిలో బిఆర్ఎస్ నిరసన

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని నినాదాలతో దద్దరిల్లిన ఎక్స్ రోడ్డు

పొలిటికల్ పవర్, ఆగస్టు 21,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు  పిలుపుతో దమ్మపేట మండలం, మందలపల్లి ఎక్స్ రోడ్డు వద్ద, జాతీయరహదారి మీద బిఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో రాస్తా రోకో చేసి నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 97 రాష్ట్రంలోని పాలిటెక్నిక్ (డిప్లొమా) విద్యా వ్యవస్థను మరియు కళాశాలలను ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ మరియు ‘శక్తి’ స్కీమ్‌లో విలీనం చేయడానికి ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు మరియు ధర్నాలు నిర్వహిస్తున్నారు వారి పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగిందన్నారు .స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన శక్తి స్కీమ్‌ తొలగించాలంటూ నాయకులు డిమాండ్ చేసారు.ప్రభుత్వం వెంటనే ఈ జీవో97ను వెనక్కి తీసుకోవాలి.డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో చేరే లేటరల్ ఎంట్రీ (ఈసెట్ ద్వారా) అవకాశం యథావిధిగా కొనసాగించాలి. జీవో ప్రకారం మళ్లీ ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ రాయాల్సి వస్తే విద్యార్థులు మూడు సంవత్సరాల చదువు వృధా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు .సాంకేతిక విద్యా విభాగాన్ని ప్రత్యేకంగా ఉంచి, ప్రభుత్వమే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి ఈ సందర్బంగా ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు వెంపటి భరత్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగ మాజీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మండల యూత్ మాజీ అధ్యక్షులు మండవ సత్య, మండల నాయకులు దారా యుగుందర్,నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకులు రావుల శ్రీనివాసరావు,అల్ల జంగం,మండల మాజీ ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు,తుమ్మల లక్ష్మణరావు,సర్పంచ్ సోయ్యం సత్యవతి, ఊప సర్పంచ్ ముత్తిన రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే,అబ్దుల్ జిన్న, వెలుగోటి మహేష్,వార్డు సభ్యులు దారా రాము,రూప రాంబాబు,ఉయ్యాల లక్ష్మీనారాయణ,మండల SC సెల్ నాయకలు మద్దెల పుల్లారావు, కొలిపోగు ధర్మ, బీసీ మండల నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు,పాకనాటి శ్రీను, వల్లెపు నాగేశ్వరావు,పాశ్యం ప్రసాద్,బండి ప్రసాద్,బాకీ శ్రీను,కొల్లి శేఖర్, నడిపల్లి పోలయ్య, అడపా నరసయ్య నాయుడు,సవలం నరసింహారావు,సోయం హేమంత్, సోయం వీర్రా స్వామి,పానుగంటి లోకేష్,తోలేం మల్లేశ్వరావు,దోద్దుల వెంకన్న,సున్నం బాలకృష్ణ, సోయం నాగేంద్ర బాబు, కిసర ప్రేమ్ సాగర్, తోగర్త నాగరాజు,మచ్చల ముత్యాలు,గుర్రమం వెంకట రామయ్య,కందుకూరి రాంబాబు,మేకల వెంకటేశ్వరావు,చిక్కాల గోపి,చిక్కాల రవీంద్ర, తాళ్ల శివ, రావుల విరభద్రం, రావుల లక్ష్మణ్,పాశం శరన్,చక్రాల పోలరాజు,పిట్టల లాలు,చిలకబత్తుల యేసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!