ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాజకీయ కుట్రలకు హైకోర్టు తీర్పుతోనే చెక్.. రేగాకు న్యాయం

రాజకీయ కుట్రలకు హైకోర్టు తీర్పుతోనే చెక్.. రేగాకు న్యాయం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్, ఆగస్టు 20,కొత్తగూడెం: బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు పై రాజకీయ కుట్రలో భాగంగా నమోదైన కేసులో గౌరవ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను అనుమతిస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల బీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు
రేగా కాంతారావు  రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక, ఆడపిల్లను అడ్డుపెట్టుకొని అక్రమ కేసును రాజకీయ కుట్రలో భాగంగా పెట్టారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా గిరిజన నాయకుడిగా రేగా కాంతారావు  ప్రజల్లో మంచి ఆదరణ పొందుతూ ఎదుగుతున్న తీరును చూసి కొందరు కుట్రలకు పాల్పడ్డారని అన్నారు.
“పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడిలా రేగా కాంతారావు  న్యాయపోరాటం చేసి, హైకోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు” అని నాయకులు పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని, రాజకీయ కుట్రలు మరియు తప్పుడు ఆరోపణలు సత్యాన్ని ఎన్నాళ్లూ దాచలేవని అన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, అశ్వరావుపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మోటూరు మోహన్. కార్పొరేటర్ సింధు తవాసి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!