*నేటి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌ల బంద్*
ఆగస్ట్ 22 : ఆదివారం పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. శనివారం 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్, జేఏసీ కన్వీనర్ ముకేశ్‌గౌడ్, ఇతర నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు 3 హామీలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 200 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. దీనికి రేవంత్ సర్కారే బాధ్యత వహించాలన్నారు. హామీలు అమలు చేయకుండా, ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదన తేవడం సరికాదన్నారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయాలని, ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న ఏటా రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓలా ఊబర్, ర్యాపి డో బైకులపై నిషేధం విధించాలన్నారు. ‘ఆటో త్రీవీలర్ లైసెన్స్ పునరుద్ధరించాలి. గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలి. ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

