ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలను అరికట్టాలి: - సీపీఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్.

ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలను అరికట్టాలి: – సీపీఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీతెలుగు న్యూస్ ఎం వెంకటేశ్వర్లు, కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్ కేబుళ్ల దొంగతనాలు వరుసగా జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని సీపీఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ ఆరోపించారు. శనివారం నర్సిరెడ్డి పల్లె లో ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం జరిగిన ప్రాంతాన్ని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. లింగాలదిన్నెపల్లి గ్రామానికి చెందిన రైతు చీమల రామిరెడ్డి (62) నర్సిరెడ్డి పల్లె లో గాలి కరుణాకర్ రెడ్డి కి చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే గత రాత్రి పొలంలో ఉన్న 16 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని కాపర్‌ను అపహరించినట్లు ఆయన తెలిపారు. మండలంలో గత కొంతకాలంగా రైతుల మోటార్ కేబుల్ వైర్లు, విద్యుత్ పరికరాలు దొంగతనానికి గురవుతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. దొంగతనాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ నిందితులను పట్టుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వారు అన్నారు. మండలంలో వరుస చోరీలతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారు అన్నారు. వరుస చోరీలపై పోలీసు యంత్రాంగం స్పందించి రైతులకు భరోసా కల్పించే విధంగా దొంగలను పట్టుకొని కటినంగా శిక్షించాలని వారు తెలిపారు. రైతుల పంటలకు నీరు అందించే ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు అందులోని కాపర్ మరియు విలువైన పరికరాలను అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటూ పదే పదే చోరీలకు పాల్పడుతున్నారు అని వారు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని, రైతుల ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్ కేబుళ్లకు భద్రత కల్పించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గోవింద్, రైతులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!