ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలను, గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించింది.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి.
నేటి సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఆశయాలకు, ఆచరణకు మధ్య అగాధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక వ్యత్యాసాల కారణంగా కుటుంబ వ్యవస్థలు, మానవ సంబంధాలు ముక్కలవుతుంటే, మరోవైపు దిగువ మధ్యతరగతి ప్రజలు వ్యవస్థల నుంచి కనీస హక్కులను సైతం పొందలేక అలమటిస్తున్నారు. సంపన్న వర్గాల పిల్లలు విదేశీ విద్యను ఒక విలాసంగా మార్చుకుంటున్న తరుణంలో, పూట గడవక కనీసం సర్కారు బడి మొహం చూడలేక బాల్యాన్ని బలిపెడుతున్న నిరుపేద పిల్లల దుస్థితి మన ప్రజాస్వామ్యానికే ఒక సవాలుగా నిలుస్తోంది.ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి పాలకులు మారుతున్నారు, సరికొత్త నినాదాలు పుట్టుకొస్తున్నాయి. కానీ, సామాన్యుడి ప్రాథమిక జీవన విధానంలో మార్పు రావడం లేదు. సంక్షేమ పథకాలను కేవలం ఓట్ల పంట పండించుకునే తాత్కాలిక సాధనాలుగా వాడుకుంటున్నారే తప్ప, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం వంటి హక్కులను అందించడంలో పాలకపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రజల పన్నులతో లబ్ధి పొందుతున్న నాయకులు, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న కొందరు నాయకుల తీరు వల్ల, దిగువ తరగతి ప్రజానీకం తమ కనీస హక్కుల కోసం కూడా పోరాడాల్సిన దైన్యం ఏర్పడింది.ఈ వ్యవస్థాగత లోపాలను ఇలాగే వదిలేస్తే సమాజంలో అసమానతలు మరింత తీవ్రరూపం దాలుస్తాయి. అందుకే, అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి పౌరుడు చట్టబద్ధమైన, ప్రజాస్వామ్యయుతమైన మార్గాల్లో ఈ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన అవసరం ఆసన్నమైంది. పాలకులు తమ బాధ్యతను గుర్తుచేసేలా, సామాన్యుడి గొంతుకను చట్టసభలకు వినిపించేలా మనమంతా నడుం బిగించాల్సి ఉందికుర్రే రాజేంద్ర రెడ్డి,
సామాజిక రాజకీయ విశ్లేషకులు.
తాడేపల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలను, గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించింది.

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

నేటి సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఆశయాలకు, ఆచరణకు మధ్య అగాధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక వ్యత్యాసాల కారణంగా కుటుంబ వ్యవస్థలు, మానవ సంబంధాలు ముక్కలవుతుంటే, మరోవైపు దిగువ మధ్యతరగతి ప్రజలు వ్యవస్థల నుంచి కనీస హక్కులను సైతం పొందలేక అలమటిస్తున్నారు. సంపన్న వర్గాల పిల్లలు విదేశీ విద్యను ఒక విలాసంగా మార్చుకుంటున్న తరుణంలో, పూట గడవక కనీసం సర్కారు బడి మొహం చూడలేక బాల్యాన్ని బలిపెడుతున్న నిరుపేద పిల్లల దుస్థితి మన ప్రజాస్వామ్యానికే ఒక సవాలుగా నిలుస్తోంది.ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి పాలకులు మారుతున్నారు, సరికొత్త నినాదాలు పుట్టుకొస్తున్నాయి. కానీ, సామాన్యుడి ప్రాథమిక జీవన విధానంలో మార్పు రావడం లేదు. సంక్షేమ పథకాలను కేవలం ఓట్ల పంట పండించుకునే తాత్కాలిక సాధనాలుగా వాడుకుంటున్నారే తప్ప, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం వంటి హక్కులను అందించడంలో పాలకపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రజల పన్నులతో లబ్ధి పొందుతున్న నాయకులు, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న కొందరు నాయకుల తీరు వల్ల, దిగువ తరగతి ప్రజానీకం తమ కనీస హక్కుల కోసం కూడా పోరాడాల్సిన దైన్యం ఏర్పడింది.ఈ వ్యవస్థాగత లోపాలను ఇలాగే వదిలేస్తే సమాజంలో అసమానతలు మరింత తీవ్రరూపం దాలుస్తాయి. అందుకే, అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి పౌరుడు చట్టబద్ధమైన, ప్రజాస్వామ్యయుతమైన మార్గాల్లో ఈ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన అవసరం ఆసన్నమైంది. పాలకులు తమ బాధ్యతను గుర్తుచేసేలా, సామాన్యుడి గొంతుకను చట్టసభలకు వినిపించేలా మనమంతా నడుం బిగించాల్సి ఉంది

కుర్రే రాజేంద్ర రెడ్డి,
సామాజిక రాజకీయ విశ్లేషకులు.
తాడేపల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

Previous article
Next article
*22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తాం: మాజీ మంత్రి హరీశ్ రావు* ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం. రేవంత్ రెడ్డి, పొంగులేటి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో పెడుతున్న సర్కారు. భూభారతి పోర్టల్ నుంచి 22A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు? పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. బోడుప్పల్ 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్.. సమావేశానికి హాజరై అండగా నిలిచిన హరీశ్ రావు. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను ప్రభుత్వం అకారణంగా 22A నిషేధిత జాబితా లో చేర్చిన నేపథ్యంలో.. తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయా కాలనీల వాసులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు గారు హాజరై బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మంద సంజీవరెడ్డి, బోడుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితర స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు గారి కామెంట్స్… ఒక ప్రభుత్వం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి పని చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు లేని సమస్యలు సృష్టించి వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు కడుపుకట్టుకుని, పచ్చడి మెతుకులు తిని, రూపాయి రూపాయి కూడబెట్టుకుని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకుంటారు. ఇక్కడ సమావేశంలో స్వప్న అనే సోదరి మాట్లాడుతూ.. పిల్లల పైచదువుల కోసం విదేశాలకు పంపేందుకు ఇల్లు కుదువబెట్టి లోన్ తీసుకుందామంటే మా ఇల్లు 22A లో ఉందని బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిడ్డ పెళ్లికో, ఆపదకో ఇల్లు అమ్ముకుందామన్నా అమ్ముకోలేని అయోమయ పరిస్థితిలోకి నెట్టేశారు. 1998లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాం 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తేశారు. ఎప్పుడో రద్దయిన చట్టాన్ని మళ్లీ తెచ్చి, పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్లకు పాల్పడాలని చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వ భూములను, ఎస్సీల అసైన్డ్ భూములను సైతం తెగనమ్ముతోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారు. ఆఖరికి గుడి కట్టడానికో, బడి కట్టడానికో, దవాఖానాకో, స్మశానానికో కూడా జాగ లేని పరిస్థితి సృష్టించారు. మరోవైపు కూకట్ పల్లిలోని 1000 గజాల ప్రైవేటు ప్లే గ్రౌండ్‌ను కూడా ప్రభుత్వం తనదే అంటోంది. రాత్రికి రాత్రే ఇళ్లను ULC కింద 22A లో దేనికోసం పెడుతున్నారు? ఇదంతా కేవలం 30 శాతం కమీషన్లు లాగడానికే. దళారులు వెళ్లి యజమానులను 30 శాతం కమీషన్ అడుగుతున్నారు. తప్పు చేసి నిషేధిత జాబితాలో పెట్టింది మీరు.. మీ కమీషన్ల కోసం చేసిన తప్పుకు సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఎందుకు అప్లికేషన్లు పెట్టుకోవాలి? ఇలా ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలని ఆలోచించడమే కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ చర్య. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.. తప్పు చేసింది మీరు, కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూడకండి. అప్లికేషన్లతో సంబంధం లేకుండా ఆ భూములను 22A నుంచి తొలగించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అధికారులు చేసిన తప్పు వెనుక దాక్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. ఆఖరికి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా 22A లోనే ఉంది. మొత్తం హైదరాబాద్ అంతా.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాలన్నీ ఈ జాబితాలోనే ఉండటం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారు. చిన్న చిన్న విషయాలకు సీఐడీ, విజిలెన్స్ ఎంక్వయిరీలు వేసి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం.. మరీ ఇంతపెద్ద తుగ్లక్ నిర్ణయం తీసుకున్న అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ఢిల్లీలో ‘నీట్’ పరీక్ష పేపర్ లీకు గురించి యువత తిరగబడితే.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన అవినీతి, స్కాములను ప్రజలు ఇన్నాళ్లూ భరించారు.. కానీ ఇప్పుడు వాళ్ల సొంత ఇళ్లనే లాక్కుంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా? లేక ప్రజల పాదాల కింద నలిగిపోతారో తేల్చుకోండని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వీళ్లు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మాత్రమే తెలుసు.. కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన పోరాటం చేయడం తెలుసు, మీ మెడలు వంచడం తెలుసు. మీ మెడలు వంచైనా సరే ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల ఇళ్లను 22A జాబితా నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తాం. ఎటువంటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధం. ఈ జాబితాలను తొలగించకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం. వాస్తవానికి ఆన్లైన్లో భూభారతి రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో 22A నిషేధిత జాబితాలను ప్రభుత్వం పూర్తిగా మాయం చేసింది. మొత్తం హైదరాబాద్ నగరాన్నే ఈ పోర్టల్ నుంచి బ్లాక్ చేశారు. ఎందుకు రాత్రికి రాత్రి ఈ పోర్టల్‌ను మాయం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ బ్లాకింగ్ పేరు మీద రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇంకేమైనా విలువైన ల్యాండ్లను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? తక్షణమే 22A ప్రొహిబిషన్ జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, వివరాలు బయటపెట్టాలని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!