ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఘనంగా బోనాల పండుగ పాల్గొన్న మాజీ మంత్రి

ఘనంగా బోనాల పండుగ పాల్గొన్న మాజీ మంత్రి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: నపర్తి పట్టణం నాగవరం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి.బోనాల పండుగలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవాలలో పాల్గొన్న పోతురాజులను అభినందించి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామ దేవతలు ,భక్తులకు ,రక్షణగా నిలిచి ప్రజలలో ఐక్యమత్యం, స్నేహభావాన్ని, భక్తిభావాలను పెంపొందిస్తాయి అని అన్నారు. ఈ ఉత్సవాలలో స్థానిక కౌన్సిలర్ స్వాతి హరిబాబు, రవికుమార్, వెంకటేష్ గౌడ్, కొత్త. రామస్వామి, మోహన్, మన్యం, వెంకటయ్య, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!