పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామంలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ సభ్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దేవాలయ కమిటీ చైర్మన్ ఆశన్న నాయుడు, ప్రధాన కార్యదర్శి కొత్త శేఖర్, వైస్ చైర్మన్ ఎత్తపు చంద్రయ్య, కోశాధికారి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు దాసర్ల రాజశేఖర్, కొత్త ప్రశాంత్, బోయిని నీలయ్య, తెలుగు రంగస్వామి, మంగనూరు వీరయ్య, గౌన్కాడి కొండన్న, అక్కల రవీందర్ గౌడ్ తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, శేఖర్ నాయక్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, మంద రాము, అలీమ్, సర్పంచ్ శాంతయ్య, మాజీ సర్పంచ్ శారద, ఆశన్న నాయుడు, గ్రామ అధ్యక్షుడు శీను, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణయ్య, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
