ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మోజర్లలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

మోజర్లలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 26 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేసుకుని అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు వాయిద్యాల నడుమ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. పండుగ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!