ePaper
Saturday, August 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ

ఆగష్టు 29:    పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

లక్షెట్టిపేట: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు జనసేన కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ తెలిపారు.

దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ ప్రాంతాలకు చెందిన జనసైనికులతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల భాగస్వామ్యం, స్థానిక సమస్యలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి మరియు అదిలాబాద్ కోఆర్డినేటర్ రాజ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఇకపై లక్షెట్టిపేటను కేంద్రంగా చేసుకుని జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, స్థానిక రాజకీయాల్లో పార్టీకి బలమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ అభివృద్ధికి అవసరమైన పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు రక్షిత్ వర్మ మాట్లాడుతూ, లక్షెట్టిపేట కేంద్రంగా రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకోనుందని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు..ఈ కార్యక్రమంలో బియ్యాల దినేష్ వర్మ, చింతల రంజిత్, రాచర్ల రాకేష్, కొత్తపల్లి సాయి, ఆవునూరు కిరణ్, గడికొప్పుల మధుకర్,మహమ్మద్ సమీర్, సుద్దాల సూర్య, కిషోర్, వెంకటేష్, సిద్దు, వినోద్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!