ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తి పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక 

వనపర్తి పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక 

📰 Generate e-Paper Clip

–సిబ్బందిసంక్షేమమేప్రధానలక్ష్యంగాపనిచేయాలి,నూతన కార్యవర్గ సభ్యులకు జిల్లా ఎస్పీ అభినందనలు,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్ 01.2026.వనపర్తి జిల్లా పోలీస్ అధికారుల సంఘంనూతనకార్యవర్గఎన్నికలు మంగళవారంజిల్లాపోలీస్,కార్యాలయంలోప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ తెలిపారు. జిల్లాపోలీస్,అధికారులసంఘంఎన్నికలప్రక్రియలోభాగంగా13మందితోకూడిననూతనకార్యవర్గాన్నిఎన్నుకున్నారు.ఎన్నికల్లోనూతనంగాఎన్నికైనఅధ్యక్షులు,ఉపాధ్యక్షులు, కార్యదర్శి,సంయుక్తకార్యదర్శి,ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి,కార్యవర్గసభ్యులనుజిల్లాఎస్పీ. సునిత రెడ్డిఐపీఎస్.అభినందించిశుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా పోలీస్ అధికారుల సంఘం 13 మందితో కూడిన నూతన కార్యవర్గం

1. అధ్యక్షులు గోవిందు, హెడ్ కానిస్టేబుల్, ఐటీ సెల్, వనపర్తి, 2. ఉపాధ్యక్షులు1.అప్పలనాయుడు, వెల్ఫేర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్,3. ఉపాధ్యక్షులు2.జయన్న, ఎస్సై. ఆత్మకూరు 4. కార్యదర్శి నాగరాజు, ఏఆర్ఎస్సై.డిఎ ఆర్,వనపర్తి,5.జాయింట్,సెక్రటరీ.సురేందర్,కానిస్టేబుల్, వీపనగండ్ల పోలీస్ స్టేషన్,6. ఆర్గనైజింగ్ సెక్రటరీ. మధు, కానిస్టేబుల్, శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్,
7. కోశాధికారి. రాజశేఖర్, కానిస్టేబుల్, వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్.కార్యవర్గ సభ్యులు.8. రమేష్ బాబు, ఏఆర్ కానిస్టేబుల్, వనపర్తి,9. ఆంజనేయులు, పీఆర్ కానిస్టేబుల్,వనపర్తి,10.అశోక్,నాయుడు,కానిస్టేబుల్, మదనాపూర్,11. బాలయ్య,కానిస్టేబుల్,మదనాపూర్ పోలీస్ స్టేషన్,12. నాగలక్ష్మి, మహిళా కానిస్టేబుల్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్,13. సుజాత, మహిళా కానిస్టేబుల్, గోపాల్పేట్ పోలీస్ స్టేషన్, నూతన కార్యవర్గానికి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగాఎస్పీ.సునీత రెడ్డిమాట్లాడుతూపోలీస్,అధికారులసంఘంఎన్నికలు పూర్తిగాప్రశాంతంగా,పారదర్శకంగా,ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడాన్ని అభినందించారు. నూతన కార్యవర్గం పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాధకబాధకాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను సంఘం ప్రతినిధులు తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని ఎస్పీ తెలిపారు. సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారం, హక్కులు మరియు అవసరాల కోసం కృషి చేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యత, నిబద్ధతతో వ్యవహరించాలని కోరారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా లేదా చట్ట విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల సంఘం కార్యకలాపాలు పోలీస్ శాఖ నిబంధనలు మరియు చట్టపరమైన పరిధిలోనే కొనసాగాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఐక్యత, సమన్వయంకోసంనూతనకార్యవర్గంసమర్థవంతంగా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డిసిఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!