

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: రేడియంట్ హైస్కూల్ తిరమలహిల్స్ లో శ్రీకృష్ణాష్టమి పండుగను ఘనంగా నిర్వాహిన్‌చారు. ఈ ప్రోగ్రామ్‌లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గోని మట్లడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ద్వాపర యుగంలో అధర్మం పెరిగినప్పుడు, దుష్టుడైన కంసుని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు మధురలో దేవకీ వసుదేవులకు జన్మించాడని, ఆయన జీవితం మొత్తం ధర్మ రక్షణకే అంకితమైందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. బాల్యంలో వెన్న దొంగగా, గోపాలుడిగా, కాళీయ మర్దనుడిగా లీలలు చూపిన కృష్ణుడు, యవ్వనంలో గీతాచార్యుడిగా మారి, కురుక్షేత్రంలో అర్జునునికి భగవద్గీతను బోధించి, మానవాళికి కర్మ యోగాన్ని అందించాడని అన్నారు. కృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, గొప్ప స్నేహితుడు, మార్గదర్శకుడు, నాయకుడని, కుచేలుని స్నేహం, పాండవులకు అండ, గోపికల పట్ల ప్రేమ – ఇవన్నీ నేటి యువత నేర్చుకోవాల్సిన గొప్ప విలువలని అన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా రేడియంట్ హై స్కూల్ వారు నిర్వహిస్తున్నారు , చిన్నారులకు కృష్ణుని వేషధారణ పోటీలు, ఉట్టి కొట్టడం, కోలాటం, భజనలు, గీతా పారాయణం వంటి కార్యక్రమాలు స్టూడెంట్స్ లో నైతిక విలువలు పెరుగుతావి అన్నీ శంకర్ గౌడ్ అన్నారు. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ మనసులోని అహంకారం, అసూయ, కోపం అనే కంసుని సంహరించి, ప్రేమ, కరుణ, సత్యం అనే కృష్ణ తత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిలో కృష్ణాష్టమికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి ఇంట్లో వెన్న, మీగడ, పాలు, పాయసంతో కృష్ణుని పూజించడం ఆనవాయితీ అని, ఈ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్కూల్ డైరెక్టర్ కౌసల్య భాస్కర్, ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ బి.రాము, ఎకో క్లబ్ కన్వీనర్ శృతి, ఉపాధ్యాయులు రాహుల్,,శాంతయ్య, శ్రీనివాస్, అఖిల్, పి ఈ టి వెంకటేష్ ,మల్లేష్, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీతా, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సాహితీ కళా వేదిక సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
