విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం
సెప్టెంబర్ 7: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షెట్టిపేట, సెప్టెంబర్07 తిమ్మాపూర్ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తిమ్మాపూర్ సర్పంచ్ ముత్తె సుధాకర్ పేర్కొన్నారు.సోమవారం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం (టిఫిన్స్) అందించే కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు.బడి పిల్లల కోసం ప్రజా పాలన ప్రభుత్వంలో కొత్త పథకం మన ప్రభుత్వ పాఠశాలలో రుచికరమైన భోజనం పోషకాహారం-మంచి ఆరోగ్యం–మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థులకు ప్రతీరోజు పోషక విలువలతో కూడిన పౌష్టికాహాన్ని అందిస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుపై దృష్టి సారించి మంచి స్థాయికి ఎదగాలని కోరారు.బడి పిల్లలకోసం వారంవారీ మెనూ సోమవారం: ఇడ్లీ సాంబార్, మంగళవారం: పూరీ ఆలూ కూర, బుధవారం: దోశ చట్నీ,గురువారం: ఉప్మా చట్నీ, శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ సాంబార్, శనివారం: బోండా చట్నీ లను అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి నాయకులు అల్పాహార విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యులు,పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు,తదితరులు పాల్గొన్నారు.

