గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
పొలిటికల్ పవర్ అధికార ప్రతినిధి సత్తుపల్లి
గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ మండపం నిర్వాహకులతో సత్తుపల్లి లోని ఏసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సైబర్ నేరాల అవగాహన కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లను, పాయింట్ బుక్స్ గణేష్ మండపాల నిర్వాహకులకు అందజేశారు.
గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ…పోలీసులకు సహకరించాలని ఏసీపీ సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు అందరూ పోలీసు శాఖ పోర్టల్ policeportal.tspolice.gov.in లో రిజిస్టర్ అయి మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జనం తదితర కార్యక్రమాలను ముందస్తు ప్రణాళికతో నిర్వహించే అవకాశం ఉంటుందని అన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ కనెక్షన్లు మరియు వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించాలని సూచించారు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని, మండపాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని స్పష్టం చేశారు. మండపాల వద్ద భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని నిర్వాహకులకు సూచించారు. రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు నిర్వహించకుండా నిబంధనలను పాటించాలని తెలిపారు.గణేష్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నిర్ణయించిన మార్గాలు, సమయాలను పాటించాలని, ఊరేగింపులో పాల్గొనే వారు క్రమశిక్షణ పాటించేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలు, నీట మునిగే ప్రమాదాలు తదితర ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో మండపాల నిర్వాహకుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి, సమస్య లేదా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాల




