ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

పేట్రేగిపోతున్న ఎక్సైజ్ కమిషనర్ అవినీతి అక్రమాలు

📰 Generate e-Paper Clip


– ప్రభుత్వ నిబంధనలకు పాతర కాసులుఇచ్చినవారికిపోస్టింగ్స్,గంజాయికేసులోనూకమీషనర్,నాటకాలు,కోటి రూపాయలిస్తే కోర్టును మోసంచేసిన వారిని కాపాడటమేన,
 – ఒక్క గంజాయి కేసు పంచనామా ఫోర్జరీలుకోట్లరూపాయలబదలాయింపు,ఈగల్ టీంలు పెట్టినా ఈ అవినీతి రాబందుల నుంచి రక్షణ ఏదీ,
– ఎక్సైజ్ కమిషనర్ తీరు పైబీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్,రాచాల యుగంధర్ గౌడ్ ధ్వజం,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఎస్ ఈశ్వర్ సెప్టెంబర్.14.2026ఇటీవల ఎక్సైజ్ శాఖలో నిబంధనలకువిరుద్ధంగాజరిగినసీఐ,ఎస్ఐ.బదిలీలపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణచేపట్టాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాలయుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసినమీడియాసమావేశంలో రాచాల మాట్లాడుతూ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్,తీవ్రఅవినీతిఅక్రమాలకుపాల్పడుతున్నాడని, అతని అవినీతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయనను రాష్ట్రం నుంచి సాగనంపాలని డిమాండ్ చేశరు.ఇటీవల జరిగిన సీఐ, ఎస్ఐ బదిలీలలో ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తు డబ్బులు ఇచ్చిన వారికే మంచి పోస్టింగ్స్ ఇచ్చారని విమర్శించారు. ఆయా పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షలవరకుముడుపులుతీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.ఈ అవినీతి బాగోతంలో కమిషనర్ తో పాటు మంత్రి సహాయకులు, గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు కలిసి ఒక ముఠాగాఏర్పడిరూ.కోట్లుదండుకున్నారనిమండిపడ్డారు.దీంతోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏసి ఎన్ఫోర్స్ మెంట్ ఒక గంజాయి కేసును పట్టుకొని పంచనామ రిపోర్టుతో సహా ఇద్దరు నిందితులను సీఐకి అప్పగిస్తే, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన పంచనామాను సిఐ చింపేసి, ఇద్దరు నిందితుల్లో ఒక్కరినే చూపించి అధికారుల సంతకాలను తానే ఫోర్జరీ చేసి కోర్టుకు నివేదించారని పేర్కొన్నారు.ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ విచారణ జరిపి కమిషనర్ గారికి రిపోర్టు చేస్తే కంటితుడుపు చర్యగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను అటాచ్ చేయడంతో పాటు సీఐని, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు.ఈ వ్యవహారంలో కూడా సీఐని డిస్మిస్ చేయకుండా కమిషనర్ దాదాపు రూ. కోటి లంచం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుందన్నారు.ఫోర్జరీ సంతకాలు చేసిన సీఐపై ఎందుకుఫోర్జరీకేసునమోదుచేయలేదనిప్రశ్నించారు.ఈమె గతంలో కూడాపట్టుకున్నగంజాయినితక్కువగా చూపించిమిగిలినగంజాయినిఅమ్ముకునిరూ.కోట్లుదండుకున్నారనిఅనేకఆరోపణలుఉన్నాయని, ఒకవైపు ప్రభుత్వంఈగల్.టీమ్,లనుఏర్పాటుచేసిడ్రగ్స్,నివారణచర్యలకోసంకృషిచేస్తుంటే ఇలాంటిఅవినీతిరాబందుల నుంచి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన అవినీతి అధికారులను కమిషనర్ ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు.ఎక్సైజ్ అధికారుల అవినీతి బాగోతానికి సంబంధించిన పూర్తి ఆధారాలుతమవద్దఉన్నాయని,త్వరలోనేముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డిజి విజిలెన్స్ ను కలిసి పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని,అంతేకాకుండా రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణను బ్రష్టు పట్టిస్తున్న కమిషనర్ హరికిరణ్ ను తిరిగి ఆంధ్ర ప్రాంతానికి సాగనంపే వరకు బీసీ పొలిటికల్ జెఎసి పోరాటం సాగిస్తోందని స్పష్టం చేశారు.మరి ఎక్సైజ్ శాఖలో ఇంత జరుగుతున్న కూడా సంబంధిత శాఖ మంత్రిజూపల్లికృష్ణారావు,ఎందుకుమౌనంవహిస్తున్నారని,ఇదంతామంత్రికితెలిసిజరుగుతుందాతెలియకుండా జరుగుతుందా? బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వివి గౌడ్, మహేందర్ నాయుడు, గోటూరి రవీందర్ గౌడ్, బత్తుల జితేందర్, రేనట్ల మల్లేష్, ముత్యాల వినోద్ సాగర్, కృష్ణప్రసాద్, శ్రీధర్, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ సెప్టెంబర్ 14.2026.దేవరకద్రనియోజకవర్గ ప్రజలకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతీ యువకులకు, మీడియా మిత్రులందరికీ వినాయక చవితి సందర్భంగా...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి,– డీజేలు, అధిక శబ్దంతో కూడిన  లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదు,ఆన్‌లైన్‌లో వివరాల నమోదు కోసం...

error: Content is protected !!