ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

📰 Generate e-Paper Clip

 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: పెద్దమందడి మండలం, మద్దిగట్ల గ్రామ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు వోల్టేజ్ సమస్యలను తగ్గించే దిశగా మద్దిగట్ల గ్రామంలో మరో అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో 25 కేవీఏ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకుచర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో స్థానికంగా విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు వోల్టేజ్ సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో త్వరలో మరో రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు గ్రామ నాయకత్వం వెల్లడించింది. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. “ప్రజల అవసరమే ప్రాధాన్యతగ్రామ అభివృద్ధే లక్ష్యంఅనే నినాదంతో మద్దిగట్ల గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Latest Articles

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్...

కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య...

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పోతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

Related Articles

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్ లేదా వెలుగండ ప్రాజెక్ట్ టన్నెల్లో ఎలాంటి అనుమతులు లేవుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య కోమలిపై దాడి //పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక & పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి...
error: Content is protected !!