ePaper
Friday, September 18, 2026
📄 ePaper

మండల స్థాయి క్రీడల్లో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 18: అశ్వారావుపేటలో 17-09-2026న నిర్వహించిన మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. క్రీడా విభాగంలో జూనియర్ స్థాయి కబడ్డీలో ప్రథమ బహుమతి, కోకోలో ప్రథమ బహుమతి, సీనియర్ స్థాయి కోకోలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో జూనియర్ స్థాయి షాట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులను విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో పాఠశాల తరఫున మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపిక కావడం విశేషం. సీనియర్ విభాగంలో వాలీబాల్‌కు నాగ లక్ష్మణ్, ధనుష్, నవనీత్, కబడ్డీకి మైఖేల్, జయప్రకాష్, మల్లేష్, కోకోకు అశోక్, సన్నీ, ప్రశాంత్, సాత్విక్ ఎంపికయ్యారు. జూనియర్ విభాగంలో వాలీబాల్‌కు రిషి, లక్ష్మణ్ గౌడ్, కబడ్డీకి సాయి చరణ్, లోహిత్, జస్వంత్, వీరేంద్ర, కోకోకు టి. జస్వంత్, ప్రవీణ్, సిహెచ్. జస్వంత్, అరుణోదయ్, నాగబాబు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులు మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. రేణుక రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ స్థాయిలో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Latest Articles

కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ....

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే...

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శనఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు...

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి....

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,...

Related Articles

సిఆర్పి 145 అమల్లో ఉన్నా.. కుదునూరు పోడు భూముల్లో మట్టి తరలింపులు?

అడ్డూ అదుపు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటున్న స్థానికులు ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు పొలిటికల్ పవర్, చర్ల, సెప్టెంబర్ 18మండల పరిధిలోని కుదునూరు ప్రాంతంలోని పోడు భూముల్లో మట్టి తవ్వకాలు, మట్టి...

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఖమ్మం శ్రీనివాసనగర్ టింబర్ డిపోలను,కట్టెల మండెలను నగరం బయటికి తరలించాలి**తెలంగాణ కాలుష్య నియంత్రణ...

యూపీఐ లావాదేవీల పన్నును ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన – దిష్టిబొమ్మ దహనం

యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే - సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 17: కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్...
error: Content is protected !!