ePaper
Friday, September 18, 2026
📄 ePaper

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:

ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లి

వెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు వేగంగా అభివృద్ధి చెందే సహజ వనరుగా ఉండటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహద పడుతుందన్నారు. వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా సంప్రదాయ వృత్తిదారులు, మేదర సంఘాల సభ్యులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.

వెదురు సాగును ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వెదురు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు, ఆధునిక డిజైన్‌లు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే సంప్రదాయ వృత్తిదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మేదర సంఘ నాయకులు గైని చంద్రశేఖర్, బూర పద్మ, చందా ప్రసాద్, కుంచనపల్లి శ్రీధర్, రాజయ్య, శంకరయ్య, సంపత్, మస్కు జయ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం...

కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ....

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే...

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శనఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు...

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి....

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,...

Related Articles

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం మూడో వార్డు నందు వడ్డెర యువసేన ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల...

కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. వైఎస్సార్ కడప జిల్లా. కలసపాడు గ్రామం, కుమ్మరి వీధిలో కుమ్మరి...

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలుబ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధితమ అనుభవంలో ఉన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, పాస్‌పుస్తకాలు మంజూరు చేసి ఆన్‌లైన్ చేయాలని...
error: Content is protected !!