ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం

సెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు ప్రథమ మహాసభ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్

కరపత్రాలు ఆవిష్కరించిన నాయకులు

ముఖ్య అతిధులుగా రాష్ట్ర నేతలు హాజరు

పాత్రికేయులు తరలిరావాలని పిలుపు

అశ్వారావుపేట :

ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు, నేడు తమ మనుగడ కోసమే పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. ఉదయరాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సెప్టెంబర్ 28వ తేదీ (సోమవారం) ఉదయం 11:00 గంటలకు స్థానిక కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్‌లో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రథమ మహాసభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ యాదవ్ హాజరవుతున్న ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ రూపొందించిన ప్రచార కరపత్రాలను యూనియన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

*​అవకాశాలు లేక.. రక్షణ కరువై..*

యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇనపనూరి ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయరాఘవేంద్ర మాట్లాడుతూ, సమాజ రక్షణలో అహర్నిశలు ముందుండే జర్నలిస్టులకు నేడు వృత్తి భద్రత, ఆరోగ్య రక్షణ కరువైందని తెలిపారు. సొంత గూడు లేక ఎంతో మంది పాత్రికేయులు అద్దె ఇళ్లలోనే జీవితాలను వెళ్లదీస్తున్నారని చెప్పారు. వార్తా సేకరణ రంగంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విలేకరులపై బెదిరింపులు, అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారడం అత్యంత విచారకరమన్నారు.

*​భేదాలు వీడి.. ఏకతాటిపైకి రండి*

రాజకీయ, వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి, మన హక్కుల సాధనకు వర్కింగ్ జర్నలిస్టులంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మన సమస్యలను మనమే గొంతెత్తి చాటాలని, ఇందుకోసం ఈనెల 28న నిర్వహించే మహాసభలు వేదిక కానున్నాయని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన పాత్రికేయ మిత్రులందరు ఆహ్వానితులేనని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో యూనియన్ ముఖ్య నాయకులు నూనె హనుమంతరావు, పెనుగొండ సత్యనారాయణ, నార్లపాటి సుబ్బారావు, బి రాము, మద్దు రవి కుమార్, దాది చంటి, ముల్లగిరి రమేష్, ముళ్లగిరి విజయ్, రాయల పోలయ్య, సలార్, గణేష్, కార్యవర్గ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు ధీరజ్...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19 సెప్టెంబర్టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్ డిఎస్పి సంపత్ రావు పోలీస్ స్టేషన్ రికార్డులు.పోలీస్ స్టేషన్లో .శాంతిభద్రతలపోలీసుల పనితీరు పల అంశములపై...

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి: మద్దిశెట్టి సామేలు

మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో 6 వేల మంది పూజారులతో భారీ బహిరంగ సభ పొలిటికల్ పవర్ సెప్టెంబర్,19:తెలంగాణ: గిరిజన శివశక్తుల పూజారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మద్దిశెట్టి శామ్యూల్ ఆధ్వర్యంలో...
error: Content is protected !!