ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో దళారులకు చోటు లేదు

📰 Generate e-Paper Clip

రైతులు, భూ హక్కుదారులు అప్రమత్తంగా ఉండాలి..

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: తహసీల్దార్

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 22: దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు ఎలాంటి అవకాశం లేదని, రైతులు, భూ హక్కుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ), దమ్మపేట తహసీల్దార్ మద్దినేని మురళి సూచించారు.

రెవెన్యూ కార్యాలయంలో దళారుల కార్యకలాపాలు తిరిగి కొనసాగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. భూ వ్యవహారాలకు సంబంధించి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు ప్రస్తుత తహసీల్దార్ పదవి కొంతకాలమే ఉంటుందని, అనంతరం తమకు అనుకూలమైన అధికారి వస్తారని రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు.

పట్టా, పాస్‌బుక్‌ పేరుతో మోసాలకు పాల్పడితే ఫిర్యాదుచేయండి

భూ బదిలీలు, పట్టా పుస్తకాలు, పాస్‌బుక్కులు తదితర భూ వ్యవహారాలను పూర్తిగా చట్టబద్ధంగా, రెవెన్యూ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నిర్వహించుకోవాలని తహసీల్దార్ సూచించారు.

ఎవరైనా దళారులు భూ సమస్యలను పరిష్కరిస్తామని, పట్టా పుస్తకాలు లేదా పాస్‌బుక్కులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినా, ప్రలోభాలకు గురిచేసినా వారి మాటలు నమ్మవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తులపై వెంటనే దమ్మపేట తహసీల్దార్ కార్యాలయానికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

దళారులపై నిఘా

ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని మద్దినేని మురళి పేర్కొన్నారు. దళారుల కార్యకలాపాలపై ఇప్పటికే నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు, భూ హక్కుదారులు తమ భూ వ్యవహారాల్లో మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

“దళారీ వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. భూ వ్యవహారాల్లో చట్టబద్ధమైన విధానాలనే అనుసరించండి” అని తహసీల్దార్ మద్దినేని మురళి విజ్ఞప్తి చేశారు.

Latest Articles

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

 ... కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య...

Related Articles

సమస్యల వలయంలో పార్కల గండి గిరిజన ఆశ్రమ పాఠశాల!

500 మంది విద్యార్థులకు సరిపడని డైనింగ్ హాల్.. కురుస్తున్న కిచెన్ షెడ్..ప్రాథమిక విద్యార్థులకు టాయిలెట్ల కొరతపొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్23: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాల్సిన ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాల...

ముష్టిబండ ఇనాం భూములపై కదిలిన రెవెన్యూ యంత్రాంగం

  వర్షంలోనూ భూముల వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు.. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తిపొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్23: మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఇనాం భూములకు సంబంధించిన వివాదంపై దమ్మపేట రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో...

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం! – ఖమ్మం జిల్లా బీసీ యువనేతకు  అవకాశం దక్కే ఛాన్స్..!? – రంగంలోకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర రాజనర్సింహ

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*రాష్ట్రంలో రానున్న శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి...
error: Content is protected !!