ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.

📰 Generate e-Paper Clip

అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది.

యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.

జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటవుదాం.. జేఏసీతో కలిసి నడుద్దాం.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే జేఏసీ ప్రధాన లక్ష్యం.

-వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి. రవికుమార్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏ ఒక్క జర్నలిస్టు యూనియన్‌కు పరిమితం కాకుండా, అన్ని యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని వనపర్తి జిల్లా జేఏసీ అధ్యక్షుడు జి. రవికుమార్ అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా జి. రవికుమార్ ను నియమించారు.ఈ నియామకాన్ని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోగరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా వనపర్తి అధ్యక్షులు జి.రవికుమార్ మాట్లాడుతూ… జర్నలిస్టుల మధ్య యూనియన్లు, సంస్థలు వేరైనా సమస్య వచ్చినప్పుడు జర్నలిస్టులందరూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత, సంస్థాగత, యూనియన్ విభేదాలకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలపై జేఏసీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. “జేఏసీ ఎవరి యూనియన్‌కు పోటీ కాదు.. ఏ యూనియన్‌కు ప్రత్యామ్నాయం కాదు. అన్ని యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సమన్వయ వేదిక. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే మా లక్ష్యం” అని జి. రవికుమార్ తెలిపారు. అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, ఇళ్ల స్థలాలు, బస్‌పాస్‌లు, వృద్ధాప్య భద్రత, ఉద్యోగ భద్రత, జర్నలిస్టుల సమస్యలు తదితర అంశాలపై పార్టీలకు, యూనియన్లకు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వనపర్తి జిల్లాలోని 15 మండలాలు, పట్టణ,వివిధ మండల ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. “జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉంటేనే సమస్యలపై బలమైన గొంతు వినిపించగలం. ఎవరు ఏ యూనియన్‌లో ఉన్నారన్నది కాదు.. జర్నలిస్టు సమస్య ఎదుర్కొంటున్నాడా లేదా అన్నదే జేఏసీకి ముఖ్యం. జర్నలిస్టులందరికీ జేఏసీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు. అన్ని జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సమిష్టిగా ముందుకు వచ్చి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని జి. రవికుమార్ పిలుపునిచ్చారు.

Latest Articles

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

 ... కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య...

Related Articles

కనిమెట్ట గ్రామంలో వితంతు, వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...

శ్రీ శివ మారుతీ  శ్రీ వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.24.2026. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకొత్తకోట మండలంలోని ముమ్మళ్ళపల్లి గ్రామంలో ని ...
error: Content is protected !!