ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య పురస్కారం

మర్రికంటి నరసింహ్మ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: నపర్తి తన కవిత్వం ద్వారా తెలుగువారిని చైతన్యవంతం చేసిన మహాకవి గుర్రం జాషువా అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్.ఎన్.ఆర్ బ్యాంకెట్ హాల్ లో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోయి కోటేశ్వర్ రావు హాజరవుతారని, ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆత్మీయ అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణానికి చెందిన ప్రముఖ వచన కవి మరికంటి నరసింహ కు “గుర్రం జాషువా సాహిత్య పురస్కారం” అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాషువా సాహిత్యం నేటి యువతకు ఆదర్శమని, ఆయన రచనల్లోని సామాజిక చైతన్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని శంకర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Latest Articles

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

 ... కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.

అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది. యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల...

Related Articles

కనిమెట్ట గ్రామంలో వితంతు, వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...

శ్రీ శివ మారుతీ  శ్రీ వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.24.2026. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకొత్తకోట మండలంలోని ముమ్మళ్ళపల్లి గ్రామంలో ని ...
error: Content is protected !!