ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

కొమరం భీమ్‌కు నివాళులు..కుటుంబాలకు పరామర్శ:సోయం వీరభద్రం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్, దమ్మపేట, అక్టోబర్‌ 22:దమ్మపేట మండలంలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం పాల్గొన్నారు. మండలంలోని మోండివర్రె గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధువును ఆశీర్వదించారు. అనంతరం దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీ పోరాట యోధుడు గోండు బెబ్బులి కొమరం భీమ్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. అలాగే అచ్యుతాపురం, అప్పారావుపేట గ్రామాల్లో జరిగిన దశదిన కర్మలకు హాజరై మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.

నూతన వధువుకు ఆశీర్వాదం

మొండివర్రె గ్రామానికి చెందిన చాట్ల శేఖర్‌–నాగమణి దంపతుల కుమార్తె సంధ్య వివాహ వేడుకకు సోయం వీరభద్రం హాజరయ్యారు. నూతన వధువును ఆశీర్వదించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

కొమరం భీమ్‌కు ఘన నివాళులు

దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్వహించిన కొమరం భీమ్‌ జయంతి కార్యక్రమంలో సోయం వీరభద్రం పాల్గొన్నారు. కొమరం భీమ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పోరాటాన్ని స్మరించుకుంటూ, “జల్‌.. జంగల్‌.. జమీన్‌” నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీమ్‌ పోరాడారని గుర్తుచేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగించిన ఆయన పోరాటం ఆదివాసీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

అనంతరం అచ్యుతాపురం గ్రామంలో తెల్లగోర్ల శ్రీను దశదిన కర్మకు హాజరైన సోయం వీరభద్రం, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అప్పారావుపేట గ్రామంలో భోగి లక్ష్మీనారాయణ దశదిన కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలు సమర్పించారు.

ఈ కార్యక్రమాల్లో పాకనాటి శ్రీను, ఎలికే శ్రీను, కోటేశ్వరరావు, కుసిని వీరయ్య, పెద్ద నగేష్‌, కారం చలమరావు, ఎమరపు ముత్యాలరావు, ఎర్రంశెట్టి భాస్కరరావు, సోయం నరసింహరావు, చాట్ల వెంకటేశ్వరరావు, ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి, సోయం వెంకన్నబాబు, వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 27...
error: Content is protected !!