ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

ఒకే మాట ఒకే బాట దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ సందేశంతో రామాయణ కావ్యాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మికి మహర్షి

📰 Generate e-Paper Clip

– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 27. 2026.ఒకే మాట ఒకే బాట దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ సందేశంతో రామాయణ కావ్యాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మికి మహర్షి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మండల పరిధిలోని వడ్డేవాట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించివాల్మీకిసోదర,సోదరీమణులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వాల్మీకి ఆలయ నిర్మాణానికి అడ్డం గా ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తొలగించడంలో చొరవ చూపిన ఎమ్మెల్యే కి గ్రామస్తులు సంఘం నాయకుల కృతజ్ఞతలు.ఈ సందర్భంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయుల నిత్యపారాయణ గ్రంథ రచయిత, వాల్మీకి పూర్వనామం రత్నాకరుడు ఆయన అట్టడుగు బోయ కులానికి చెందినవాడు దారి దోపిడీలు దొంగతనాలు హత్యలు చేసి కుటుంబ పోషణ జరుపుకునే వాడు ఏమాత్రందయ ప్రేమ కరుణ లేని జీవితం గడిపాడు నారదుడి మంత్రోపదేశం తో రత్నాకర బోయి ఘోర తపస్సు చేయడం వలన అతనిపై పుట్ట పెరిగినది ఆ పుట్టలో నుంచి మళ్లీ బయటికి వచ్చిన వాడు కావున  రత్నాకర్ బోయి వాల్మీకి గా మారి వేలవేల శ్లోకాలను ఏకరువు పెట్టి రసరమ్యమైన రామాయణ ప్రచురించడానికి కారణం అయినాడు.రామాయణ గ్రంథాన్ని 7 ఖండలుగా ,24,000 శ్లోకాలతో కుటుంబ గాధగా పితృవాక్య పరిపాలన సర్వ సోదర ప్రేమ ఏకపత్నీ వ్రతం శత్రువునైనా ప్రేమించడం ఒకే మాట ఒకే బాట దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ అని సందేశంతో రామాయణ కావ్యాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మికి. దాదాపు ప్రపంచ భాషలన్నింటిలోనూ వాల్మీకి రామాయణం తర్జుమా అయింది తెలుగులో శతాబ్దాల నుంచి ఆయా కవులు శ్రీరామ మాధుర్యాన్ని ఆదర్శాలను తమ తమ రచనలను విశేషంగా చాటారు రామాయణ కథలు సమాజంలో ఎవరు ఎలా మెలగాలో బోధించాడు సత్యం ధర్మం లోకానికి రెండు కళ్ళు వాటిని పరిత్యజిస్తే  లోకం మనుగడ సాగించలేదు అధర్మం నుంచి ధర్మం అసత్యం నుండి సత్యం వైపు నడిపించాలన్నదే వాళ్ళకి ఆశయం ఆదర్శం అందుకే రాముని కథానాయకుడిగా నిలబెట్టాడు వివాహ బంధం పాతివ్రత్యం కుటుంబ పాలన విధానం రాజు అనుసరించాల్సిన విధానాలను ఈ ప్రపంచ కుటుంబ బాంధవ్యాలకు మార్గం చూపించిన మహర్షి వాల్మీకి అన్నారు.మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచించిన రామాయణం సమాజానికి అందించిన నైతిక విలువలు, ధర్మం, సత్యం, మానవత్వం వంటి గొప్ప సందేశాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అనంతరం
వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామంలో వాల్మీకి ఆలయ నిర్మాణానికి హైటెన్షన్ విద్యుత్ లైన్ అడ్డంకిగా మారడంతో గుడి నిర్మాణం ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ సమస్యను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి విద్యుత్ హైటెన్షన్ లైన్‌ను మార్పించేందుకు చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.ఎమ్మెల్యే గారి చొరవతో విద్యుత్ లైన్ సమస్య పరిష్కారం కావడంతో ఆలయ నిర్మాణ పనులకు మార్గం సుగమమైందని వాల్మీకి సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం వాల్మీకి సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు ప్రహరీ గోడ నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.తదనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసి, తమ కుటుంబం తరఫున లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండ్ల రాములు, మండల అధ్యక్షుడు నాగరపు బీచ్పల్లి యాదవ్ కొత్తకోట పట్టణ అధ్యక్షులు పెంటన్న యాదవ్ చర్లపల్లి సర్పంచ్ శేఖర్ రెడ్డి, తరుణ్ నాయక్, రామ్ లాల్ నాయక్, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 27 2026: వనపర్తి...

పిల్లల భద్రత – సమాజ బాధ్యత బాలల హక్కుల పరిరక్షణే సురక్షిత సమాజానికి పునాది

– పిల్లల రక్షణపై కేపీఎస్ విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి  కె. దీప, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని  బిఆర్ఎస్ కు చెంపపెట్టుగా ఇంటి వద్దకే వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం

– కాంగ్రెస్ పార్టీ కొత్తకోట మండల అధ్యక్షులు నాగరాపు బీచ్పపల్లి యాదవ్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 28. 2026.పదేళ్లలో ఒక్క...
error: Content is protected !!