
ఖమ్మం రూరల్ / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (ప్రత్యేక ప్రతినిధి – యర్ర నాగరాజు రెడ్డి):
సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, పేదరికం, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు “మేమున్నామంటూ” అండగా నిలుస్తోంది జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) సంస్థ. సమాజంలో మానవత్వం, సేవాభావం, సమానత్వమే పరమావధిగా సాగుతున్న ఈ సంస్థ, తన నిరంతర సేవలతో ప్రజాదరణ పొందుతోంది.
ఈ క్రమంలోనే, JSPW సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ పెద్దపాక రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని వెంకటగిరి గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. JSPW సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం క్రమం తప్పకుండా చేపడుతున్న ఈ అన్నదాన సేవలో భాగంగా ఈ వారం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు.
వలస కుటుంబాలకు ఆపన్న హస్తం:
నిర్మల్ జిల్లా నుంచి జీవనోపాధి కోసం వలస వచ్చి, వెంకటగిరి గ్రామంలో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుని నివసిస్తున్న సంచార జాతుల (వలస) కుటుంబాలకు ఈ సందర్భంగా JSPW ప్రతినిధులు స్వయంగా భోజన వితరణ చేశారు. ఆకలితో ఉన్న పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప సేవ అని, వారి ముఖాల్లో నవ్వులు చూడటమే తమ సంస్థ అసలైన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు.
మేధావులు, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న JSPW సేవలు:
కేవలం పండుగలు, పబ్బాలకే పరిమితం కాకుండా ప్రతీ సోమవారం నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం పట్ల స్థానిక ప్రజలు, మేధావులు, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ JSPW మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, అవసరంలో ఉన్న పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న JSPW కమిటీ ప్రతినిధులు:
ఈ సేవా కార్యక్రమంలో JSPW సంస్థ ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో:
* పెద్దపాక రమేష్ (JSPW ఫౌండర్ & చైర్మన్)
* వేముల సీతారామారావు
* నామ వినోద్ కుమార్
* పులిపాటి నరసింహారావు
* మామిళ్లపల్లి నాగాచారి
* గడదాసు అప్పారావు
* మురికిపూడి బాబురావు
* యర్ర నాగరాజు రెడ్డి (బ్యూరో రిపోర్టర్)
* బత్తుల గోపాలరావు
* చెన్నబోయిన లక్ష్మీనారాయణ
* మహమ్మద్ అజ్గారు
పెద్దపొంగు శ్రీకాంత్
తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం కోసం శనగల వెంకటేశ్వర్లు (పాల్వంచ ) తనవంతు సహాయం గా వెయ్యి రూపాయలు నగదుగా అందించారు
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న JSPW సంస్థ చేపడుతున్న ఈ నిరంతర అన్నదాన కార్యక్రమం ఇతర స్వచ్ఛంద సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

