ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

శ్రీశైలం దేవస్థానంలోనీ బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

📰 Generate e-Paper Clip


నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 3 (పొలిటికల్ పవర్ న్యూస్ )
లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది.
ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి.
బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం,బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

Latest Articles

చెంచు గిరిజనుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం ఈవో, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్: గిరిజన మహిళల హర్షం!

నంద్యాల జిల్లా, శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు...

రైతుల కడుపు కొట్టిన మురసు

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ వి ఆర్...

*మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత తాగునీరు జాతీయ మానవ హక్కుల కమిషనర్ మిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య* 

**పొలిటికల్ పవర్ న్యూస్ నాంపల్లి మండలం*భగీరథతో నల్గొండ జిల్లా, నాంపల్లి...

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కొరతపై ఏఆర్వో ఆగ్రహం

 కరస్పాడు కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్ 9...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు...

Related Articles

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కొరతపై ఏఆర్వో ఆగ్రహం

 కరస్పాడు కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ .ఎం. ప్రసాద్ రావు.కలస్పాడు వైఎస్ఆర్. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని...

error: Content is protected !!