ePaper
Friday, November 6, 2026
📄 ePaper

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి!

📰 Generate e-Paper Clip

RSETI శిక్షణతో 36 మంది గ్రామీణ మహిళలకు ఉద్యోగాలు

నెలకు రూ.20 వేల వేతనం.. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు

శిక్షణ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: వనపర్తి మహిళలు ఆర్థికంగా ఎదిగి, స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వాటిని ఉపాధి అవకాశాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వనపర్తి యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (UBI RSETI) ఆధ్వర్యంలో నిర్వహించిన వినూత్న శిక్షణ కార్యక్రమం ద్వారా 36 మంది మహిళలకు ఉద్యోగాలు లభించడం విశేషం. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో, NABARD ఆర్థిక తోడ్పాటుతో తొలిసారిగా ‘జాపా మైడ్ కమ్ హోమ్ క్యులినరీ ఎక్స్‌పర్ట్’ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 3 నుంచి 28 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 మంది మహిళలకు 20 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందించారు. నవజాత శిశువుల సంరక్షణ, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, తల్లీబిడ్డల సంరక్షణ, గృహ వంటకాలు, వృత్తిపరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన నిపుణులైన అధ్యాపకులతో బోధన అందించడంతో పాటు గోపాల్‌పేట మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి, వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్షేత్రస్థాయి శిక్షణ కల్పించారు.

శిక్షణతో ఆగకుండా ఉద్యోగాల కల్పనకు కృషి..

మహిళలకు శిక్షణ అందించడమే కాకుండా, వారు ఉద్యోగాలు సాధించే వరకు అండగా నిలిచే బాధ్యతను RSETI తీసుకుంది. సంస్థ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన PORTEA Medical Services సంస్థతో ఉద్యోగ అనుసంధానం ఏర్పాటు చేశారు. ఫలితంగా శిక్షణ పూర్తి చేసుకున్న 60 మందిలో 36 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎంపికైన మహిళలకు నెలకు కనీసం రూ.20 వేల వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.

మహిళల చేతుల్లో ఉద్యోగ నియామక పత్రాలు..

గత నెల 26న నిర్వహించిన శిక్షణ ముగింపు, ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, NABARD DDM మనోహర్ రెడ్డి పాల్గొని అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. తాజాగా గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్వయంగా 36 మంది మహిళలకు PORTEA Medical Services సంస్థ అందించిన ఉద్యోగ నియామక పత్రాలను అందజేసి అభినందించారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమైన ప్రతి అవకాశాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఒక మహిళ ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలను తీర్చుకోవడంలో ఆమె భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. మహిళలు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. వనపర్తి నియోజకవర్గంలోని మహిళలకు ఇలాంటి ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు జిల్లా యంత్రాంగం, శిక్షణ సంస్థలు, పరిశ్రమలు, ఉద్యోగ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ మధుసూదన్ గౌడ్, PORTEA Health Services రీజినల్ మేనేజర్ శ్రీకాంత్, RSETI డైరెక్టర్ బి. అనిల్ కుమార్, PD DRDA ఉమాదేవి, ZP డిప్యూటీ CEO రామ మహేశ్వర్ రెడ్డి, LDM శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ ఇచ్చి వదిలేయకుండా ఉద్యోగాలు కల్పించడం.. ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందించి మహిళలను ప్రోత్సహించడం.. గ్రామీణ మహిళల జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్న ఈ కార్యక్రమం వనపర్తి జిల్లాలో మహిళా సాధికారతకు ఒక మంచి ముందడుగుగా నిలుస్తోంది.

Latest Articles

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8...

Related Articles

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8 మంది ఎంపిక.. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక

  ఆలయ అధ్యక్షుడిగా చాపల శివరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: పెద్దమందడి మండలం...
error: Content is protected !!