ePaper
Friday, November 6, 2026
📄 ePaper

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

📰 Generate e-Paper Clip

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8 మంది ఎంపిక..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: విద్యార్థులను అభినందిస్తూ వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిన లెటర్ ను గురువారం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ముజాహిద్ ఖాన్ ఎమ్మెల్యే కు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి అభినందనలు

ఆర్థిక పరిస్థితులు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందిన వనపర్తి నియోజకవర్గానికి చెందిన 8 మంది విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం వారి భవిష్యత్తుకు గొప్ప భరోసా అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి విద్యను అందిపుచ్చుకుని ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పథకం నిదర్శనమని కొనియాడారు. ఎంపికైన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తమ కుటుంబాలకు, వనపర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తన సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Latest Articles

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి!

RSETI శిక్షణతో 36 మంది గ్రామీణ మహిళలకు ఉద్యోగాలు నెలకు రూ.20 వేల...

Related Articles

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి!

RSETI శిక్షణతో 36 మంది గ్రామీణ మహిళలకు ఉద్యోగాలు నెలకు రూ.20 వేల వేతనం.. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు శిక్షణ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ పొలిటికల్ పవర్...

మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక

  ఆలయ అధ్యక్షుడిగా చాపల శివరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: పెద్దమందడి మండలం...
error: Content is protected !!