ePaper
Friday, November 6, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 6 ( పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పి ఎన్9 టీవీ తెలుగు న్యూస్ )

లోకకల్యాణంకోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.

ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది.

ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి.

లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.

కాగా శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.

ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.

కాగా దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరితీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది.

కాగా శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.

శ్రీపాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది.

నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు.కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువకావడముతో, నృసింహసరస్వతీస్వామి అదృశ్య రూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు.

శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతిస్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటిఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది.

Latest Articles

ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ‘జైపాల్ రెడ్డి’ కొత్త జిల్లా? – సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

పొలిటికల్ పవర్, పొలిటికల్ బ్యూరో:తెలంగాణ రాజకీయంలో సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతోంది! భార్య...

అంకమ్మ చెరువుకు తక్షణ మరమ్మతులు చేపడతాం: మంత్రి తుమ్మల

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తుమ్మల.. పెద్దవాగు ప్రాజెక్టుపై...

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన

వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువుల పరిశీలన ...

లక్షల కోట్ల వారసురాలు… అయినా ఆమె… ఆ అనంత పద్మనాభుడికి సామాన్యుల్లోనే అతి సామాన్య దాసురాలు!!*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*గుంటూరు దుగ్గిరాల మండలంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ...

నరకానికి చిరునామా ‘చెన్నమ్మ సర్కిల్’: హైవే పై నిత్యం ట్రాఫిక్ నరకం.. ప్రాణాలు పోతున్నా నిద్రమత్తులో యంత్రాంగం!

పొలిటికల్ పవర్ (సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక) కర్నూలు జిల్లా | కల్లూరు ఎస్టేట్ ప్రత్యేక కథనం రిపోర్టర్: దస్తగిరి. పి (కర్నూలు) తేదీ: 05 నవంబర్ 2026బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై...

పసుమర్తి శ్రీనివాస్ రావు మృతి వ్యాపార, సామాజిక రంగాలకు తీరని లోటు: మాజీ మంత్రి వనమా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వనమా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్కొత్తగూడెం ( ) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్‌కేఆర్...
error: Content is protected !!