ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన

📰 Generate e-Paper Clip

వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువుల పరిశీలన

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 06 2026: అశ్వారావుపేట లో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ, ఎమ్మెల్యే అశ్వారావుపేట, నవంబర్ 6 మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువులను పరిశీలించారు. స్థానిక ప్రజలను, నష్టపోయిన రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం బాధిత ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలు, నీటి ప్రవాహ మార్గాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్, వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పంటలు దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వ పరంగా తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సాధారణ జీవనం పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా...

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు..నవంబర్ 7 :...

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్...

న్యాయవాద వృత్తిని వదిలి.. ప్రజాసేవే లక్ష్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రస్థానం !

– విద్య, వైద్యం, మౌలిక వసతులు అన్ని రంగాల్లో దేవరకద్ర అభివృద్ధే...

ఈ నెల11న కుమ్మర ఇంటి ఆడపడుచు మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపన

 ఎమ్మెల్యే. తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా భూమి పూజకు కార్యాచరణ...

Related Articles

మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు! విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి పునరాగమనం పట్టణ సమస్యలపై వైస్ చైర్మన్ ప్రత్యేక దృష్టి అభివృద్ధి పనులపై ప్రజల్లో పెరిగిన ఆశలు  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్ట్...

బాస్ ఇస్ బ్యాక్ … మళ్లీ రంగంలోకి జూపల్లి రమేష్ బాబు!   * బాస్ ఇస్ బ్యాక్… మళ్లీ ప్రజాక్షేత్రంలోకి!   * బాస్ ఇస్ బ్యాక్ … అభివృద్ధి బాటలో జూపల్లి రమేష్ బాబు అడుగులు!పొలిటికల్...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్...
error: Content is protected !!