ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

గార్ల మండలం మున్నేరు రైతు రక్షణ కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గార్ల మండల కేంద్రంలోని విశ్వ న్యాయవాద కార్యాలయంలో కో కన్వీనర్ సోమ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ కన్వీనర్ మూడు హరినాయక్ మాట్లాడుతూ పేద గిరిజన రైతుల పుట్టగొట్టే మున్నేరు పాలేరు లింక్ కెనాల్ జీవో 98 ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నేరు పరివాహక ప్రాంతానికి ఏ ప్రయోజనం లేని మున్నేరు పాలేరు లింక్ కెనాల్ రద్దు చేయడం కోసం రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. ప్రభుత్వం మున్నేరు పాలేరు లింకు కెనాల్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను చర్చించి నిర్ణయించుకొనుటకు నవంబర్ 7న సాయంత్రం నాలుగు గంటలకు గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మూడు హరినాయక్ తెలిపారు. ఈ సమావేశానికి రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ గౌరవనీయ సలహాదారు విశ్వ జంపాల, కో కన్వీనర్లు బానోత్ రమేష్ బాలాత్ చంటి బుక్కే హనుమంతు బాదావత్ రమేష్ భూక్య చిన్న, మూడు వాల్యా మూడు రాము భుూక్యా రాజు, బాదావత్ సేవియా, గిన్నారపు మురళి తారక రమారావు, మూడు భాస్కర్ మూడు సురేష్ మూడు అశోక్, భూక్య శ్యాం, ముంగి రాములు తదితరులు పాల్గొన్నారు.

మూడు హరినాయక్

కన్వీనర్

మున్నేరు రైతు రక్షణ కమిటీ – గార్ల

Latest Articles

టేకులపల్లి స్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ 

 పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్...

కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

 కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పికర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో...

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే...

Related Articles

ఇల్లందు పూరపాలకం3, 4′ 5 వార్డులలో ప్రవహిస్తున్న బుగ్గ వాగు కు ఇరువైపులా రిటైనింగ్ వాల్ మంజూరు 

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9న్యూస్ / నవంబర్ 8ఇల్లందు నియోజకవర్గంలో బుగ్గ వాగు 3'4'5 వార్డుల్లో ప్రవహిస్తున్న వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య...

టేకులపల్లి స్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ 

 పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ / టేకులపల్లి ప్రతినిధి K సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను...

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం ---బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్...
error: Content is protected !!