ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి

ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు

ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం

—బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్ 08 2026: రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ ఫీజును వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్. రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ….. రాష్ట్రంలో దాదాపు 1250 బార్లు ఉన్నాయని, వాటిలో 62,500 మంది వరకు ఉపాధి పొందుతున్నారని, వారి నుంచి వారి కుటుంబ సభ్యులు దాదాపు 3 లక్షల 75 వేల మందికి బార్ల ద్వారా జీవనం కొనసాగుతుందన్నారు. నేడు ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు పెంచడం వల్ల బార్లు మూతపడే అవకాశం ఉందని, దీంతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందన్నారు. దీనంతటికీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తీరే ప్రధాన కారణమని, కమిషనర్ ఇచ్చిన తప్పుడు నివేదికతోనే ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు పెంచుతూ జీవో జారీ చేయడం జరిగిందని మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కనీస సమాచారం లేకుండా కమిషనర్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుందన్నారు. నిత్యం పబ్బుల్లో గడిపే కమిషనరుకు బార్ అండ్ రెస్టారెంట్లపై అవగాహన లేనట్టుందని, అవగాహన లేని తనంతోనే లక్షల మందికి ఉపాధిని దూరం చేసే విధంగా కమిషనర్ పోకడలు కొనసాగుతున్నాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ప్రివిలేజ్ ఫీజు పెంచడం వల్ల బార్లు నడిచినా… నడవకపోయినా ప్రతిరోజు ప్రభుత్వానికి దాదాపు రూ. 30 వేలు టాక్స్ కట్టాల్సి వస్తుందని, నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోయినా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కమిషనర్ హరికిరణ్ తీరు వల్ల ప్రజా ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని దుయ్యబట్టారు. ఒకపక్క ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, మరో పక్క లక్షల మందికి ఉపాధిని దూరం చేస్తున్న కమిషనర్ తీరు ఇకనైనా మార్చుకోవాలని హితవు పలికారు. కమీషనర్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ఆయన అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో సహా సిబి సిఐడికి ఫిర్యాదు చేయడంతో పాటు ఢిల్లీ లోని డివోపిటిలో కూడా ఫిర్యాదు హెచ్చరించారు. కేవలం ప్రభుత్వం ఇస్తున్న జీతం మీదే ఆధారపడి, ఎలాంటి నెల మామూళ్ళు తీసుకోకుండా పనిచేస్తున్న ఎక్సైజ్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే గుండె మీద చేయి వేసుకొని చెప్పాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తక్షణమే పెంచిన ప్రివిలేజ్ ఫీజుపై పునరాలోచన చేసి, బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు చాపలి వెంకటేష్, శ్రీధర్, సిద్ధార్థ్, రామ్ మాధవ్, మంజునాథ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మారుతి,లింగప్ప, తిరుపతి, పూల శ్రీను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే...

పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు రోడ్డు...

తిరుమలయ్య గుట్టను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

రూ.2 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు.. రహదారి, తాగునీరు, హరిత హోటల్‌తో పాటు...

జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్: బత్తుల రామకృష్ణ భార్యపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఘన విజయం!

 సీతానగరం/తూర్పుగోదావరి:పొలిటికల్ పవర్ ప్రతినిధితూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది....

Related Articles

మేడిపల్లి కమల నగర్ కాలనీలో రోడ్డును ఆనుకొని అక్రమ షెడ్ నిర్మాణం*   నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు

 మేడిపల్లి: 08 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి పరిధిలోని కమల నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆనుకొని వెలుస్తున్న అక్రమ షెడ్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం...

జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర ఆకస్మిక తనిఖీ…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :గార్ల మండల పరిధిలో గార్ల, సీతంపేట, సత్యనారాయణపురం, గ్రామాలలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను...

కొత్తగూడ ఏజెన్సీలో అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలను తక్షణమే తొలగించాలి… ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తే సహించం! అధికారుల మౌనం వెనుక ముడుపుల మాయాజాలం?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచంగా నిలవాల్సిన చట్టాలు కొత్తగూడ మండల కేంద్రంలో...
error: Content is protected !!