
నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్)
ఈ రోజు ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి
ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది.
కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది.
కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

