ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం….

వనపర్తి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక చర్యలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: వనపర్తి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో నియోజకవర్గంలోని 11 గ్రామాలు, తండాల్లో అత్యవసర తాగునీటి సరఫరా పనుల కోసం రూ.27 లక్షల నిధులకు జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం, మోటార్ల మమ్మతులు, పైపులైన్లు దెబ్బతినడం వల్ల తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎస్‌బీఎం(జీ) నిధుల ద్వారా చేపట్టనున్న అత్యవసర పనులకు అనుమతులు లభించాయి.

మంజూరైన పనుల వివరాలు…

1. దత్తాయిపల్లి: పాత మోటార్, పైపులైన్ మరమ్మతులు రూ.4.50 లక్షలు.

2. నాచహళ్లి తండా: మోటార్, పైపులైన్ మరమ్మతులు, బోర్‌వెల్ డీపెనింగ్ పనులకు రూ.2 లక్షలు.

3. పెద్ద తండా.. మోటార్, పైపులైన్ మరమ్మతులు, బోర్‌వెల్ ఫ్లషింగ్ డిపెనింగ్ రూ.2 లక్షలు.

4. తూర్పు తండా.. మార్కెట్ యార్డు దెబ్బతిన్న పైపులైన్ మార్పిడి – రూ.5 లక్షలు.

5. పామిరెడ్డిపల్లి: దెబ్బతిన్న పైపులైన్ మరమ్మతులు – రూ.2 లక్షలు.

6. కిష్ట్య తండా: పాత మోటార్ మార్పిడి – రూ.76 వేలు.

7. నాగులకుంట తండా: పాత మోటార్ మార్పిడి – రూ.79 వేలు.

8.అల్లమాయిపల్లి: దెబ్బతిన్న పైపులైన్ మార్పిడి – రూ.4 లక్షలు.

9. షాకాపూర్: పైపులైన్, మోటార్ మార్పిడి – రూ.3.50 లక్షలు.

10. గొల్లపల్లి: పాత మోటార్ మార్పిడి – రూ.1.50 లక్షలు.

11. మొత్తం రూ.27 లక్షలతో 11 అత్యవసర పనులు చేపట్టనున్నారు. తాగునీటి కొరత నివారణ చర్యల కోసం ఎస్‌ఎస్‌బీఎం(జీ) నిధుల నుంచి రూ.1 కోటి కేటాయింపులు జరగగా, అందులో భాగంగా వనపర్తి జిల్లాలో ప్రస్తుతం రూ.27 లక్షల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ పనులు పూర్తయితే ఆయా గ్రామాలు, తండాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడి ప్రజలకు ఇబ్బందులు తగ్గనున్నాయి. వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయనీ ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా వనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించి సహకరిస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష

​ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.12.2026.వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర...

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది

– రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తుంది, వ్యవసాయ యాంత్రీకరణ పథకంద్వారారైతులకుఅవసరమైనయంత్రాలను, పరికరాలను, విత్తనాలను అందించాం, – బీఆర్ఎస్ పదేళ్ల...

సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కేఎల్ఐ, జూరాల నీటి విడుదల కోసం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నా రైతులకు సాగునీరు అందించరా? – మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...
error: Content is protected !!