ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

📰 Generate e-Paper Clip

కేఎల్ఐ, జూరాల నీటి విడుదల కోసం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా

శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నా రైతులకు సాగునీరు అందించరా? – మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 11 2026: అవకాశాలు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాంతాన్ని మూడేళ్లలో కరువు జిల్లాగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండగా, మరోవైపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేఎల్ఐ, జూరాల ప్రాజెక్టుల ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వెంకట్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీశైలం జలాశయంలో సుమారు 50 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పంపులను పూర్తిస్థాయిలో నడపకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెద్దమందడి మండలంలోని ఒక్క గ్రామానికి కూడా సాగునీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేఎల్ఐ కింద ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు నీరు అందించాలని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను నడిపి ఏదుల, కరివేన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని కోరారు. ఆల్మట్టి జలాశయంలో నీటి లభ్యత, కర్ణాటక నుంచి వచ్చే వరద ప్రవాహాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులకు వేగంగా ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే వనపర్తిలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

రైతుల పక్షాన పోరాటం చేస్తాం: బీరం హర్షవర్ధన్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువని విమర్శించారు. కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర రైతులకు ఒక్క చుక్క నీటిని కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి హయాంలో సాగునీటిని ఒడిసిపట్టి రైతులకు అందించామని, ప్రస్తుతం పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణం కోసం పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కేఎల్ఐ, జూరాల ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

శ్రీశైలం నీటితో కొత్తకోట మండలాన్ని సస్యశ్యామలం చేయవచ్చు: ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీశైలం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటితో కొత్తకోట మండలాన్ని సస్యశ్యామలం చేయవచ్చని అన్నారు. గతంలో కేసీఆర్ కృషితో కందూరు వాగుకు నీటిని తీసుకొచ్చామని, ప్రస్తుతం ఇసుక దందా కోసం వాగును ఎండబెట్టారని ఆరోపించారు. రైతులకు రైతుబంధు, రైతుభరోసా, యూరియా, రుణమాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కేఎల్ఐ పంపులను నిరంతరాయంగా నడిపి రైతులను ఆదుకోవాలని కోరారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం

ధర్నా అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ద్వారా వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటిని కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా గరిష్ఠంగా వినియోగించుకోవాలని కోరారు. కేఎల్ఐ ఆయకట్టు పరిధిలోని పెద్దమందడి, మణిగిళ్ల, ఆల్వాల, మద్దిగట్ల, మోజర్ల, వెల్టూరు, చిలకటోనిపల్లి, గట్లఖానాపూర్‌తో పాటు అడ్డాకల్, మూసాపేట, పానగల్, వనపర్తి మండలాల్లోని గ్రామాలకు సమానంగా సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల వారీగా వారాబందీ లేదా రొటేషన్ పద్ధతిలో నీటి పంపిణీ షెడ్యూల్ రూపొందించాలని, జూరాల ఆయకట్టులోని వేరుశనగ, మినుములు, మొక్కజొన్న తదితర పంటలు కోత దశకు చేరుకునే వరకు ఆర్‌ఎన్‌సీ, ఎంఎన్‌సీ, సమాంతర కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్లను ప్రారంభించి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని, చిన్న నీటిపారుదల చెరువులను సైతం నింపాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు రఘుపతి రెడ్డి, ఇంద్రయ్య సాగర్, నాగిరెడ్డి, ఈధన్న, కొండారెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, నందిమల్ల అశోక్, వామన్ గౌడ్, విశ్వేశ్వర్, ప్రశాంత్, చెన్నకేశ్వర్ రెడ్డి, కమలేశ్వరరావు, సత్యనారాయణ గౌడ్, చంద్రశేఖర్ నాయక్, వీరసాగర్, తిలకేశ్వర్ గౌడ్, పెద్దమందడి మాజీ జడ్పీటీసీ కే రఘుపతి రెడ్డి, హేమంత్ ముదిరాజ్, శ్రీను, మురళి సాగర్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, వినోద్ గౌడ్, ఆరిఫ్, పాషా, అలీమ్, క్రాంతికుమార్, ఇమ్రాన్ బిన్ అలీ, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

చంద్రబాబు అరాచకాలపై నిలదీసిన వైఎస్‌ జగన్‌! స్థానిక పోరులో అక్రమాల ఆవిష్కరణలను ప్రజలు గమనిస్తున్నారు!

తాడేపల్లి (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

శ్రీశైల క్షేత్రంలో ఉచిత బస్సు సదుపాయం: ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైలం (పొలిటికల్ పవర్ - పిఎన్9 టీవీ):కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల...

*ఉచిత బస్సు సదుపాయం

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 11(పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

కరువుతో రైతులు కన్నీరు మున్నీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.11.2026.జిల్లాలో పంటలు ఎండికరువుతోరైతులుకన్నీరుమున్నీరవుతున్నారని కేంద్ర రాష్ట్ర...

క్యాన్సర్ చికిత్స పొందిన టీడీపీ గౌస్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 10 2026: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ గౌస్...

టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి...
error: Content is protected !!