ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

మామిళ్ళపల్లి *వాసవిక* పుట్టినరోజు సందర్భంగా JSPW ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం  * ఖమ్మం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆహార వితరణ  * మానవతా దృక్పథంతో ప్రతి సోమవారం సేవా యజ్ఞం: JSPW చైర్మన్ పెద్దపాక రమేష్

📰 Generate e-Paper Clip

ఖమ్మం, నవంబర్ 9 (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ – బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి):

మామిళ్ళపల్లి

*’వాసవిక ‘* పుట్టినరోజును పురస్కరించుకుని జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. JSPW సంస్థ ప్రతి సోమవారం నిరంతరాయంగా చేపడుతున్న సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఖమ్మం రైల్వే స్టేషన్‌లోని నిరుపేద ప్రయాణికులకు, వృద్ధులకు, వికలాంగులకు సంస్థ ప్రతినిధులు అన్నదానం చేశారు. అనంతరం ఖమ్మం ఓవర్ బ్రిడ్జి కింద, పూజా హాస్పిటల్ ఎదురుగా నివసిస్తున్న అనాథలకు, అభాగ్యులకు భోజన పాకెట్లను అందజేశారు.

ఆకలి తీర్చడమే పరమావధి:

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… “ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే మించిన గొప్ప సేవ మరొకటి లేదు. సమాజంలో ఆదరణకు నోచుకోని నిరుపేదలు, అభాగ్యులు, వికలాంగులు, అనాథలకు అండగా నిలవడమే JSPW ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో నిరుపేదలకు సహాయం చేస్తూ మానవతా విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.

హాజరైన ప్రముఖులు:

సమాజహితమే ధ్యేయంగా జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంపై స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో JSPW వ్యవస్థాపక అధ్యక్షులు & చైర్మన్ పెద్దపాక రమేష్, వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు, ప్రధాన కార్యదర్శి నామా వినోద్ కుమార్, ట్రెజరర్ మామిళ్ళపల్లి నాగయ్య జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ అస్గర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యర్ర నాగరాజు రెడ్డి, పులిపాటి నరసింహారావు, చెన్నబోయిన లక్ష్మీనారాయణ, గడదాసు రామారావు, మురికిపూడి బాబురావు, బత్తుల గోపాలరావులతో పాటు పెద్దపొంగు శ్రీకాంత్, అనుముల కార్తీక్, TS GENCO ఉద్యోగి పెద్దపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కార్తీక శోభ: ధ్వజస్తంభంపై వెలిగిన ఆకాశదీపం

 నంద్యాల జిల్లా (పొలిటికల్ పవర్ న్యూస్):పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల...

విద్యావైతాళ్లికుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్...

సమాఖ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జారె వినతి

CBO HR పాలసీ అమలు చేయాలని PR & RD కమిషనర్‌కు...

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపుపొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద...

Related Articles

కార్తీక శోభ: ధ్వజస్తంభంపై వెలిగిన ఆకాశదీపం

 నంద్యాల జిల్లా (పొలిటికల్ పవర్ న్యూస్):పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక మాసం పూర్తయ్యే...

విద్యావైతాళ్లికుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోభారతదేశ...

పెండింగ్ అరెస్టులు పూర్తి చేయాలి,  NDPS కేసుల్లో సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించాలి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి. నేర నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ...

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. శబరీష్,...
error: Content is protected !!