
జూలూరుపాడు నవంబర్13: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో సాయి ఎక్సలెంట్
స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు మరియు వినోద కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ, భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ,పట్టుదలతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి, నబీనా, ప్రశాంతి, సత్యవతి, కళ్యాణి, అరుణ, భార్గవి, స్వాతి, అనిత, రిచిత, కృష్ణ వేణి, జమున, మమత, రజిత, హరిత, డి.రిచిత విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

