ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పత్రిక స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభకాంక్షలు -పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026: ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటాము. 1993లో ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రకటించింది. 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛ కోసం చేసిన ప్రకటనకు గుర్తుగా ఈ రోజును ఎంచుకున్నారు. పత్రికా స్వేచ్ఛ అంటే ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిడి లేకుండా, భయం లేకుండా వార్తలను సేకరించి, ప్రచురించే హక్కును పత్రికలకు కల్పించడమే పత్రికా స్వేచ్ఛ అని శంకర్ గౌడ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. నిజాలను ప్రజల ముందు ఉంచడం, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, సమాజంలో జరిగే అన్యాయాలను బయటపెట్టడం పత్రికల బాధ్యత అన్నారు. స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం బతకదు. ప్రజలకు నిజాలు తెలిస్తేనే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. కుంభకోణాలు, అక్రమాలు బయటపడేది పత్రికల వల్లే. బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించేది పత్రికలే అన్నారు. ఇప్పుడు జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులూ, ఫేక్ న్యూస్, సెన్సార్‌షిప్ ఎక్కువైపోయాయి. చాలా దేశాల్లో నిజం రాసినందుకు జైలుకు వెళ్తున్నారు. డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కేవలం జర్నలిస్టుల పని కాదు. ప్రజలుగా మనం నిజమైన వార్తలను చదవాలి, ఫేక్ న్యూస్‌ను నమ్మకూడదు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలబడాలి అన్నారు. పత్రికా స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ. అది ఉంటేనే మన గొంతు వినిపిస్తుంది. ప్రజల పక్షనా నిలబాడే ప్రతి జర్నలిస్ట్ కు పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం శుభకాంక్షలు తెలిపారు.

Latest Articles

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

Related Articles

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో...

రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయ సమస్యలు పరిష్కరించాలి వాల్మీకి బోయిలకు రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లలో చోటు కల్పించాలి వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలి వాల్మీకి బోయిలను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలి హైదరాబాద్ ట్యాంక్...

అన్నదాతలకు అధైర్యం వద్దు,  చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం, పెబ్బేరు, శ్రీరంగాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!