సబ్ -రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత డబ్బులతో వీల్ చైర్
బిజెపి రాష్ట్ర నాయకుడు మున్నూరు రవీందర్ దాతృత్వం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: ఇటీవల వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బిజెపి రాష్ట్ర నాయకుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ తన సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉచితంగా వీల్ చైర్ బహుకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజలకు రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అందుబాటులో అసౌకర్యంగా నిత్యం రద్దీగా కొత్తకోట వెళ్లే రహదారిలో ఉన్న సబ్- రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఇటీవల వనపర్తి కొత్త బస్టాండ్ సమీపంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన సమీకృత మార్కెట్ యార్డులో మొదటి అంతస్థు లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారని అయినప్పటికీ మొదటి అంతస్థు లో సబ్- రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, తో పాటు అనారోగ్యంతో వివిధ రోగాలతో బాధపడుతున్న ప్రజల కోసం బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకుడు న్యాయవాది మున్నూరు రవీందర్ తన సొంత ఖర్చులతో ఉచితంగా వీల్ చైర్ సబ్- రిజిస్ట్రార్ చంద్రశేఖర్ రెడ్డికి అందచేశారు.
ఈ సందర్భంగా మున్నూరు రవీందర్ మాట్లాడుతూ… ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంతభవనాలను ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వనపర్తి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గుట్టలు,అడవులలో కార్యాలయా నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారని లక్షల రూపాయల డబ్బులతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు వ్యాపారస్తులకు సెక్యూరిటీ లేక ఆ కార్యాలయం శంకుస్థాపనకి పరిమితమైందని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న సబ్ రిజిస్ట్రేషన్ సొంత కార్యాలయం నిర్మాణంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినట్లు మున్నూరు రవీందర్ ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలను నిర్మించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. అలాంటి సందర్భంలో గత్యంతరం లేక సమీకృత వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సబ్ -రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించినప్పటికీ మొదటి అంతస్తు ఎక్కలేని వికలాంగులు వృద్ధులు సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్ ను తాను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మున్నూరు రవీందర్ చేసిన కృషిని ప్రజలు అభినందించారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు సీనియర్ సిటిజన్లు మున్నూరు రవీందర్ అందించిన వీల్ చైర్ పట్ల హర్షం వ్యక్తం చేశారు.
