పెద్దమందడి మండలము పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రోజున అనారోగ్య కారణాలవల్ల ఇద్దరు వ్యక్తులు వడ్డే పెద్ద బాలస్వామి మరియు బర్ల మల్లయ్య మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి తక్షణ హార్దిక సహాయం ఒక్కొక్కరికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు వార్డు సభ్యులు కొంకలి నరేష్ కావలి కృష్ణ నాయకులు కొంకల్లి నరసింహ లక్ష్మారెడ్డి సిద్దు, చందు షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
