ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

షాదీ డాట్‌కామ్ ద్వారా పరిచయం… పెళ్లి పేరుతో మోసం… బంగారం దోచుకుని పరార్.

విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలే నిందితుడి లక్ష్యం

మ్యాట్రిమోని సైట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన.

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మే 14

మంచిర్యాల జిల్లా: హాజీపూర్

కాళహస్తి శిరీష్ కుమార్,తండ్రి శంకరయ్య,వయస్సు 38 సంవత్సరాలు, కులం:రెడ్డి,వృత్తి: కార్ డ్రైవర్,నివాసం:ఇంటి నెం. 3-137, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా చెందిన వ్యక్తి shadi.com మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా కర్ణమామిడి గ్రామానికి చెందిన రాంపెళ్లి రజిత, తండ్రి స్వామి, అను మహిళతో పరిచయం ఏర్పరుచుకొని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.తేదీ 01-05-2026న శిరీష్ కుమార్ తన AP39SD 9060 నంబర్ గల మోటార్‌సైకిల్‌పై కర్ణమామిడి గ్రామంలోని రజిత ఇంటికి వచ్చాడు.పెళ్లి కోసం బంగారం కొనిపిస్తానని చెప్పి, రజితను తన బైక్‌పై మంచిర్యాలలోని ఒక బంగారు దుకాణానికి తీసుకెళ్లాడు.అక్కడ మాట్లాడిన అనంతరం తిరిగి రజితను కర్ణమామిడికి తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో గుడిపేట ఫిష్ మార్కెట్ దాటిన తర్వాత సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో మహారాజ్ ఫ్యామిలీ ఢాబా సమీపానికి చేరుకున్నారు.ఆ సమయంలో శిరీష్ కుమార్ తన బైక్‌ను జాతీయ రహదారి–63 పక్కన ఆపి,రజిత మెడలో ఉన్న బంగారు గొలుసు బరువు చూస్తానని చెప్పి ఇవ్వమన్నాడు.రజిత తన గొలుసును ఇవ్వగానే,శిరీష్ కుమార్ ఆమెను పక్కకు నెట్టి,బంగారు గొలుసుతో పాటు తన బైక్‌పై అక్కడి నుండి హైదరాబాద్ వైపు పరారయ్యాడు.అనంతరం తేదీ 12-05-2026న కాళహస్తి శిరీష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుండి AP29L 1342 నంబర్ గల కారు మరియు AP39SD 9060 నంబర్ గల బైక్‌ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.కాళహస్తి శిరీష్ కుమార్ గతంలో కూడా ప్రకాశం జిల్లాలో మూడు బైక్ దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. అదేవిధంగా, మ్యాట్రిమోని సైట్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఒంటరి మహిళతో పరిచయం ఏర్పరుచుకొని, ఆమెను పెళ్లి చేసుకుని రూ.3,00,000/- తీసుకొని పరారైన ఘటనలో కూడా అతనిపై కేసు నమోదై, ఆ కేసులో కోర్టుకు హాజరవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.వివాహ సంబంధ వెబ్‌సైట్ల ద్వారా పరిచయాలు ఏర్పరుచుకునే సమయంలో, సంబంధిత వ్యక్తులు ఇచ్చిన వివరాలను పూర్తిగా ధృవీకరించిన అనంతరమే వివాహ నిర్ణయాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన హాజీపూర్ ఎస్‌ఐ డి. కిరణ్ కుమార్,కానిస్టేబుళ్లు బి.తిరుపతి,జి.సత్యనారాయణ,జి.చంద్రశేఖర్,పి.రాజేందర్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!