ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 సోమశిల స్వర్ణ గ్రామ  కార్యాలయాన్ని

పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి అనంతసాగరం మండలం

ఎంపీడీవో మరియు డిప్యూటీ ఎంపీడీవో (SGSW)ఈరోజు సోమశిల స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించారు. సెన్సస్ ఎన్యూమరేషన్ వెంటనే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా డోర్ లాక్డ్ ఇండ్లను మరియు ఖాళీగా ఉన్న ఇళ్లను పరిశీలించి ఈనెల 25వ తేదీ లోపల అన్ని గృహాలకు సంబంధించి సెన్సస్ మొదటి దశ సర్వే పూర్తి చేయవలసినదిగా తెలియజేశారు. అదేవిధంగా ఏకీకృత కుటుంబ సర్వే, మరియు ఇతర సర్వేలకు సంబంధించి 100% పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు. అనంతరం త్రాగునీటి పథకాలను పరిశీలించి వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకునవలసినదిగా సిబ్బందికి తెలియజేశారు. గ్రామంలో తిరుగుతున్న స్వచ్ఛ రథాన్ని పరిశీలించి గ్రామ ప్రజలందరూ తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలు మొదలైన పొడి చెత్తను స్వచ్ఛరథం ఆపరేటర్ కు అందజేసి తమకు ఉపయోగపడే నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడం కానీ లేదా నగదు రూపంలో పొందడం కానీ చేయవచ్చని ఎంపీడీవో తెలిపారు. తడి చెత్తను సేకరించి గ్రామంలో వర్మి కంపోస్ట్ తయారు చేయడ చేయడం ద్వారా గ్రామపంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చని, పొడి చెత్తను స్వచ్చ రథం ఆపరేటర్ కు విక్రయించి నిత్యవసర సరుకులు కానీ నగదు కానీ పొందవచ్చునని, దీని ద్వారా గ్రామ పరిశుభ్రతకు తోడ్పడిన వారు అవుతారని డిప్యూటీ ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారి చెంచయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!