ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అటెన్షన్ డైవర్షన్ *అంతర్ రాష్ట్ర దొంగల* ఆట కట్టించిన నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు.

 

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

      *రైతన్నలే టార్గెట్..!*

 

బ్యాంకుల వద్ద రైతుల కష్టార్జిత డబ్బులపై కన్నేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్..

 

వడ్లు పండించేందుకు ఎండనక.. వాననక.. చెమటోడ్చి సంపాదించిన డబ్బులు క్షణాల్లో మాయం చేస్తున్న కేటుగాళ్లు..

 

బ్యాంకు నుంచి నగదు తీసుకున్న రైతులను ఫాలో అవుతూ..

 

*డబ్బులు పడిపోయాయి..బైక్‌కు ఆయిల్ కారుతోంది..బట్టలపై మురికి పడింది..* అంటూ మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి నగదు దోచేస్తున్న ముఠా..

 

నల్గొండ, నకిరేకల్ ప్రాంతాల్లో రైతులను టార్గెట్ చేసిన దొంగలు *24 గంటల్లోనే వన్ టౌన్ పోలీసుల వలలో..*

 

రూ.2.20 లక్షల నగదు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం..

 

*రైతులకు, ప్రజలకు నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి హెచ్చరికలు..*

 

• బ్యాంకుల నుంచి భారీ నగదు తీసుకొస్తే ఒంటరిగా వెళ్లొద్దు..

 

• అపరిచితులు మాట్లాడితే అప్రమత్తంగా ఉండండి…

 

• బైక్ దగ్గర, నగదు దగ్గర అపరిచితులను నమ్మొద్దు..

 

• అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి..

 

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం అవుతుంది…

 

రైతన్నలు, ప్రజలు అవగాహనతో నడుచుకోవాలి..

 

*నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి.☝️*

 

ఇట్టి కేసులో ప్రతిభ కనబరిచి, 24 గంటలలోపు నేరస్తులను చాకచక్యముగా పట్టుబడి చేసి అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన DSP శివరాం రెడ్డి, CI రాజ శేఖర్ రెడ్డి, ఎస్సైలు సైదులు, సైదాబాబు మరియు సిబ్బంది రబ్బాని, రాజు, శంకర్, అజ్మత్, అంజయ్య, కిరణ్, ఆంజనేయులు మరియు సత్యనారాయణ తదితరులను జిల్లా ఎస్పి ప్రత్యేకముగా అభినందించారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!