ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రీల్ హీరోలు కాదు..కుట్రల చక్రవ్యూహాన్ని ఛేదిస్తున్న ఏకైక రియల్ హీరో వైఎస్ జగన్.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

 

మనం పవణ్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో ఒక అద్భుతమైన సీన్ చూస్తుంటాం. హీరో రేంజ్ ఏంటో చూపించడానికి దర్శకుడు ఒక సీన్ డిజైన్ చేస్తాడు. హీరోను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక, విలన్ తన చుట్టూ ఒక ఇరవై ముప్పై మంది రౌడీలను, ఆయుధాలను వేసుకొని వస్తాడు. కానీ ఆ సినిమా హీరో ధైర్యంగా నిలబడి, వాళ్ళందరినీ ఒంటరిగానే దెబ్బకు దెబ్బ తీసి విజయం సాధిస్తాడు. థియేటర్లలో ఆ సీన్‌కు విజిల్స్ పడతాయి, చప్పట్లు మోగుతాయి. ఎందుకంటే అక్కడ న్యాయం గెలిచింది, ఒంటరిగా పోరాడిన వాడు గెలిచాడు కాబట్టి..

కానీ అది స్క్రీన్ మీద కనిపించే మూడు గంటల సినిమా. అక్కడ గ్రాఫిక్స్ ఉంటాయి, డూప్‌లు ఉంటారు, ముందే రాసుకున్న స్క్రిప్ట్ ఉంటుంది.

అలాంటి సీన్ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో రియల్’గా లైవ్‌గా జరుగుతోంది..

ఈ రాజకీయ మహాభారతంలో కుట్రల పద్మవ్యూహాన్ని ఒంటరిగా బద్దలు కొడుతున్న అసలైన రియల్ హీరో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఒక్కడిపై ఇంతమంది దాడా, ఎందుకీ భయం జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచించండి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నాయకుడిని ఒంటరిగా, సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యం ఇక్కడున్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు కి పార్టీ కి లేదు. అందుకే ఆయన్ను దెబ్బతీయడానికి, ప్రజల్లో ఆయనకున్న ఆదరణను తగ్గించడానికి ఒకరితో ఒకరు చేతులు కలిపారు.

 

రాజకీయ కూటములు కు సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు… జగనన్నను గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు ఒకటయ్యాయి.

 

యెల్లో మీడియా సామ్రాజ్యం అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవి వార్తా సంస్థలు కావు, జగన్ గారిపై బురద చల్లడానికే పుట్టిన అబద్ధాల ఫ్యాక్టరీలు. నిత్యం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఆయన మీద విషం చిమ్మడమే వీటి పని.

అవె కాకుండా వ్యవస్థల దుర్వినియోగం రిటైర్డ్ అధికారులు, కొన్ని యూనియన్లు, మహిళా నాయకురాళ్లను ముందు పెట్టి నిత్యం ఏదో ఒక రూపంలో రాజకీయ దాడి చేస్తూ, అపవాదులు వేస్తూనే ఉన్నారు..

 

ఇంతమంది శత్రువులు, ఇన్ని అస్త్రాలు ,నిరంతర కుట్రలు ఒక సామాన్య నాయకుడైతే ఈ పాటికి తట్టుకోలేక తలవంచేవాడేమో.

కానీ అక్కడ ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం సింహం బిడ్డ

అలసట లేదు.అడుగు వెనక్కి పడలేదు.

ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది ఏకమై గుంపులుగా వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నడూ అధైర్యపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, పేద ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన హిమాలయంలా నిలబడ్డారు.

 

సరిగ్గా సినిమా క్లైమాక్స్ లాగే… చుట్టూ ఇరవై మంది విలన్లు కత్తులు నూరుతుంటే, తల దించకుండా, గుండె ధైర్యంతో వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలు, ప్యాకేజీల బంధాలు ఆయన నిఘంటువులోనే లేవు. సింగిల్‌గా వచ్చి సింహంలా గర్జించడమే ఆయన నైజం..

చివరిగా నేను చెప్పెది ఏంటంటే సినిమాల్లో డూప్‌ల సాయంతో, కెమెరా ట్రిక్కులతో హీరోలు అనిపించుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లు కేవలం ‘రీల్’ హీరోలు మాత్రమే. కానీ, నిజ జీవితంలో… కోట్ల మంది పేదల గుండెల్లో స్థానం సంపాదించి,

ఇంతమంది శత్రువుల దాడిని ఒంటరిగా తట్టుకొని, వెరవక, బెదరక ధైర్యంగా నిలబడ్డ నాయకుడు చరిత్రలో ఒక్కడే ఉంటాడు.

ఆ రియల్ హీరోనే… మన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

చేతులు కలపడం బలహీనుల లక్షణం… ఒంటరిగా నిలబడటం మొనగాడి లక్షణం

ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం… ఈ సింహాన్ని ఎవరూ ఏమీ చేయలేరు..ఈ సారి గోల్ కొడితే టార్గెట్ మిస్ అవ్వదు..వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా

Latest Articles

మున్నూరు రవీందర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి

పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతకు అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి...

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం చివ‌రి శ్వాస వ‌ర‌కు ప‌నిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.#YSRForeverWww.political...

error: Content is protected !!